Konda Murali: ఇటీవల కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి శనివారం (జూన్ 28) టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరుకానున్నారు. గాంధీభవన్‌లో ఎంపీ, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి బృందం ఎదుట ఆయన హాజరుకానున్నారు. ఈ మేరకు కొండా మురళి పెద్ద ఎత్తున తన అనుచరులతో కలిసి గాంధీభవన్‌కు బయలుదేరారని సమాచారం.
Konda Murali: ఇదిలా ఉండగా, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కడియం శ్రీహరి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి ఇద్దరిపైనా కొండా సురేఖ వర్గం ఫిర్యాలు చేసింది. క్రమశిక్షణా కమిటీ వారిద్దరిపైనా విచారణ జరపాలని కోరింది. ఈ మేరకు మంత్రి కొండా సురేఖ అనుచరులు టీపీసీసీకి ఫిర్యాదులు చేసినట్టు తెలిసింది. మురళిని విచారించిన తర్వాత వారితో చర్చించే విషయమై టీపీసీసీ నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం.
Konda Murali: అయితే ఇటీవల వరంగల్‌లో జరిగిన ఓ సమావేశంలో కొండా మురళి.. స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కడియం శ్రీహరి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డిపై పరోక్షంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వరంగల్ జిల్లాకు చెందిన కనుబొమ్మలు లేని నాయకుడు 15 ఏళ్లు టీడీపీని భ్రష్టు పట్టించాడు. చంద్రబాబును ఓడించి, ఆయన మాత్రం మంత్రి పదవిని అనుభవించాడు.. అని కడియం శ్రీహరిని ఉద్దేశించి మురళి పరోక్ష వ్యాఖ్యలు చేశారు.
Konda Murali: కేసీఆర్, కేటీఆర్‌లను తప్పుదోవ పట్టించి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరిండు.. అతను ఎన్‌కౌంటర్ల స్పెషలిస్టు.. అని కడియం గురించి మురళి వ్యాఖ్యలు చేశారు. అదే విధంగా పరకాలలో 74 ఏండ్ల దరిద్రమైన నాయకుడు, ముసలోడు ఎమ్మెల్యేగా గెలిచిండు. ఎన్నికల ముందు మా వద్దకు వచ్చి మా కాళ్లు పట్టుకొని ఈ సారి సీటు మాకు వదిలిపెట్టండని అడిగాడు.. అని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి గురించి పరోక్షంగా కొండా మురళి వ్యాఖ్యలు చేశారు.
Konda Murali: బయటి పార్టీల నుంచి వచ్చిన నాయకులు ఇజ్జత్ ఉంటే రాజీనామా చేసి మళ్లీ గెలవాలని అని వారిద్దరికీ పరోక్షంగా మురళి సవాల్ విసిరారు. ఈ వ్యాఖ్యల ఫలితంగా వరంగల్ జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు భగ్గుమన్నారు. మురళి వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరాలను వ్యక్తంచేశారు. ఈ మేరకు కాంగ్రెస్ అధిష్ఠానం సహా టీపీసీసీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫలితంగా నేడు కొండా మురళి నుంచి వివరణ కోరేందుకు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ విచారించనున్నది.