Komatireddy Raj Gopal Reddy: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌లో ఫైర్‌బ్రాండ్‌గా మారారు. ఆయన గత కొంతకాలంగా కాంగ్రెస్ సర్కారును ఇరుకున పెట్టేలా? చేస్తున్న వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఏకంగా సీఎం రేవంత్‌రెడ్డిపైనా ఆయన ఘాటైన వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలపైనా ఆయన పదునైన వ్యాఖ్యలతో హడలెత్తిస్తున్నారు. ఇటీవల నిరుద్యోగులకు మద్దతుగా అమరవీరుల స్తూపం వద్దకు వెళ్లి నివాళులర్పించిన సందర్భంగా కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Komatireddy Raj Gopal Reddy: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తరచూ చేస్తున్న వ్యాఖ్యలతో ఆయన కాంగ్రెస్‌పై అసంతృప్తితో ఉన్నారని, పార్టీ మారుతారని విశేష ప్రచారం జరుగుతూ వచ్చింది. ఆయన గతంలో వెళ్లి వచ్చిన బీజేపీలోకే మళ్లీ వెళ్తారా? లేక బీఆర్ఎస్ పార్టీలో చేరుతారా? అన్న ప్రచారం జరిగింది. కొన్ని విషయాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వమే నయమంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అందుకు బలం కూడా చేకూర్చాయి.
Komatireddy Raj Gopal Reddy: ఇదే దశలో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఏపీలోని గుంటూరుకు వెళ్లారు. ఆయన వెంట కార్ల కాన్వాయ్ పెద్ద ఎత్తున వెళ్లడంతో ఆయన ఏకంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ను కలిసేందుకు వెళ్తున్నారని, అదే పార్టీలో చేరుతారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయా ఆరోపణలపై కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి స్పందించారు. అవన్నీ పుకార్లేనని, తాను పార్టీ మారబోనని తేల్చి చెప్పారు.
Komatireddy Raj Gopal Reddy: కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే గిట్టని వారే తాను పార్టీ మారుతానంటూ దుష్రచారం చేస్తున్నారని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తాజాగా స్పష్టం చేశారు. తాను కొత్త పార్టీ పెడుతున్నానని, ఎమ్మెల్యే పదవికే రాజీనామా చేస్తున్నట్టు పుకార్లు పుట్టిస్తున్నారని, తానంటే గిట్టని వ్యక్తులే ఇలా చేస్తున్నారని తెలిపారు. సోషల్ మీడియా ద్వారా తన ఇమేజ్‌ను తగ్గించేలా ఫేక్ న్యూస్ వైరల్ చేస్తున్నారని ధ్వజమెత్తారు.
Komatireddy Raj Gopal Reddy: తనకు మంత్రి పదవి రాకపోవడం వల్ల ప్రభుత్వానికి, సీఎం రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నానని అంటూ అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వివరణ ఇచ్చారు. గుంటూరులో ఓ ప్రైవేటు ప్రోగ్రాంకు వెళ్తే తాను జగన్‌ను కలుస్తానని, ఇంకా ఏదేదో ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అసలు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని మొదటిసారి అసెంబ్లీలో ప్రశ్నించింది తానేనని, కానీ, కాళేశ్వరం ప్రాజెక్టును నేను సమర్థిస్తున్నట్టు వార్తలను వైరల్ చేస్తున్నారని మండిపడ్డారు.
Komatireddy Raj Gopal Reddy: తాను ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇస్తున్నానే తప్ప, ప్రభుత్వానికి, పార్టీకి ఎప్పుడూ వ్యతిరేకంగా తాను మాట్లాడలేదని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఎంపీ, ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ నుంచే గెలుపొందానని, కోమటిరెడ్డి ఫ్యామిలీ అంటేనే కాంగ్రెస్ అని చెప్పారు. తాను పార్టీ మారుతున్నట్టు కొత్తపార్టీ పెడుతున్నట్టు జరుగుతున్న ప్రచారాన్ని ప్రజలెవరూ నమ్మ వద్దని హితవు పలికారు.