Virat Kohli

Virat Kohli: కోహ్లీ విజయ రహస్యం: కఠోర సాధన కాదు.. అంతా మానసికమే!

Virat Kohli: రాంచీలో దక్షిణాఫ్రికాపై అద్భుత శతకం సాధించి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్న టీమిండియా దిగ్గజం విరాట్ కోహ్లీ, తన విజయ రహస్యాన్ని వివరిస్తూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. తాను ఎప్పుడూ గంటల తరబడి కఠోర సాధన పై ఆధారపడనని, తన క్రికెట్ ప్రయాణం అంతా మానసిక సన్నద్ధత పైనే నడుస్తుందని ఆయన స్పష్టం చేశారు. “నేను ఎప్పుడూ కఠోర సాధనను ఎక్కువగా నమ్మను. నా క్రికెట్ అంతా మానసికమైనది” అని కోహ్లీ పేర్కొన్నారు. నెట్స్‌లో చేసే ప్రాక్టీస్ కంటే, మ్యాచ్ సమయంలో సరైన మానసిక స్థితిలో ఉండటమే తన అత్యుత్తమ ప్రదర్శనలకు కారణమని ఆయన వివరించారు.

ఇది కూడా చదవండి: Elon Musk: అమెరికా ఎదగడానికి కారణమే.. భారత యువకులు

కోహ్లీ తన ఆట కొనసాగడానికి రెండు కీలకమైన అంశాలను మాత్రమే ముఖ్యమని నమ్ముతున్నారు. అవే శారీరక ఫిట్‌నెస్ మానసిక పదును. “శారీరక ఫిట్‌నెస్, మానసిక పదును ఉన్నంత కాలం నేను ఆడగలను” అని ఆయన గట్టిగా చెప్పారు. ఒక ఆటగాడిగా తనకున్న సుదీర్ఘ అనుభవం, సరైన మానసిక స్థితిని కలగలిపి అద్భుతాలు సృష్టిస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా, మైదానంలో ఎదురయ్యే ఒత్తిడిని సమర్థంగా ఎదుర్కోవడానికి ఈ మానసిక పదును ఎంతో అవసరమని, అందుకే కేవలం శారీరక శిక్షణ కంటే మైండ్‌సెట్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని కోహ్లీ తన మాటల ద్వారా స్పష్టం చేశారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *