Kishan Reddy: మెస్సీ కార్యక్రమంపై రేవంత్ రెడ్డిపై కిషన్ రెడ్డి ఆగ్రహం

Kishan Reddy: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ కార్యక్రమానికి సింగరేణి నుంచి రూ.10 కోట్లు ఖర్చు చేశారని ఆయన ఆరోపించారు.

సింగరేణి కార్మికులకు జీతాలు, కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలు, మెడికల్ రీయింబర్సుమెంట్స్‌కు డబ్బులు లేవని, కానీ మెస్సీ ఈవెంట్‌కు మాత్రం కోట్ల రూపాయలు ఖర్చు చేశారని మండిపడ్డారు. “ఎవడో ఫుట్‌బాల్ ఆడుతాడు, అతను వస్తే నా సింగరేణికి ఏం సంబంధం?” అంటూ తీవ్రంగా ప్రశ్నించారు.

సింగరేణి కార్మికుల కష్టార్జిత నిధులను ఇలా ఖర్చు చేయడానికి సీఎం రేవంత్ రెడ్డికి ఎవరు అధికారం ఇచ్చారని ఆయన వ్యాఖ్యానించారు. ఇక సింగరేణి నిధులను గతంలో బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం దోచుకుంటోందని కూడా కిషన్ రెడ్డి ఆరోపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *