Kiran Abbavaram

Kiran Abbavaram: ఆనంద్ కథతో కిరణ్ అబ్బవరం!?

Kiran Abbavaram: ఆనంద్ దేవరకొండ, వైష్ణవీ చైతన్య జంటగా సాయిరాజేశ్ దర్శకత్వంలో ‘బేబీ’ సినిమాను రూపొందించారు యస్.కె.ఎన్. చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈ మూవీ ఘన విజయం సాధించి పలు అవార్డులను సైతం గెలుచుకుంది. ‘బేబీ’ రిలీజ్ అయిన మూడు నెలలకు ఇదే కాంబోలో మరో సినిమా వస్తుందని ప్రకటించారు. రవి నంబూరి దర్శకత్వం లో ఎస్.కె.ఎన్, సాయిరాజేశ్ నిర్మిస్తారని ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. అయితే ఇప్పటి వరకూ దాని ఊసే లేదు. ఆనంద్, వైష్ణవి వేరు వేరుగా బిజీ అయిపోయారు. ఇదిలా ఉంటే అప్పట్లో ఈ సినిమాకు అనుకున్న కథ ఇప్పుడు కిరణ్ అబ్బవరం చెంతకు చేరిందట. గతేడాది ‘క’ సినిమాతో పలకరించి సక్సెస్ కొట్టిన కిరణ్ అబ్బవరం ప్రస్తుతం ‘దిల్ రూబా’ సినిమాతో రాబోతున్నాడు. ఫిబ్రవరిలో రాబోతున్న ఈ మూవీ తర్వాత ‘కె ర్యాంప్’ అనే మూవీ కూడా కమిట్ అయ్యాడు కిరణ్. దాని తర్వాత ఆనంద్ దేవరకొండకు అనుకున్న కథతో కిరణ్ సినిమా చేస్తాడట. త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తారట. మరి ఆనంద్ ఉంచి కిరణ్ అబ్బవరం చెంతకు చేరిన కథ సినిమాగా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూద్దాం.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *