kiran abbavaram: ప్రస్తుత కాలంలో సినిమాపై బజ్ రావాలంటే పవర్ ఫుల్ లేదా ఆకర్షణీయమైన టైటిల్ ఉండాలి. లేదా టీజర్, లుక్ అదిరిపోవాలి. అప్పుడే ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తి పెరిగి బజ్ ఏర్పడుతుంది. అలా విచిత్రమైన టైటిల్ ‘క’తో దీపావళికి వచ్చి హిట్ కొట్టాడు కిరణ్ అబ్బవరం. సినిమాలో కంటెంట్ ఉంటే సరిపోదు… దానిని జనాల్లోకి తీసుకెళ్ళగలగాలి. అలా వెళ్ళింది కాబట్టే థియేటర్లతో పాటు ఇటు ఓటీటీలోనూ ఆకట్టుకుంటోంది ‘క’ సినిమా. అందుకే ఇప్పుడు ‘కె ర్యాంప్’ అనే టైటిల్ తో రాబోతున్నాడట. కిరణ్ అబ్బవరం తదుపరి చిత్రం టైటిల్ ఇది. ఈ ‘కె ర్యాంప్’కు సోషల్ మీడియాలో వేరే వేరే అర్థాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాను హాస్య మూవీస్ పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. కథ సిద్ధం అయింది. ఈ నెల 14లోపు ఎనౌన్స్ మెంట్ కూడా రానుంది. మరి వింత టైటిల్ తో దీపావళి రేస్ లో పోటీ పడి మరీ గెలిచిన కిరణ్ అబ్బవరం ఈ సారి కూడా అదే రిజల్ట్ ను రిపీట్ చేస్తాడేమో చూడాలి.
