Kingdom: రౌడీ స్టార్ విజయ్, భాగ్యశ్రీ జంటగా.. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో వస్తున్న పాన్ ఇండియా మూవీ కింగ్ డమ్.. జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ తో రిలీజ్ చేసిన టీజర్ సినిమా మీద అంచనాలు పెంచేసింది. జూలై 31న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది.. ఏపీలో పది రోజుల పాటు టికెట్ రేట్లు పెంచుకోవచ్చు అంటూ గవర్నమెంట్ జీవో జారీ చేసింది. సింగిల్ స్క్రీన్స్ లో, జీఎస్టీతో కలిపి 50 రూపాయలు, మల్టీప్లెక్సుల్లో 75 రూపాయల చొప్పున పెంచుకునేందుకు వీలు కల్పించింది.
