Kingdom

Kingdom: ‘కింగ్‌డమ్’కి బంపర్ ఓపెనింగ్స్‌ పక్కా?

Kingdom: విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ‘కింగ్‌డమ్’ సినిమా యూఎస్‌లో అడ్వాన్స్ బుకింగ్స్‌తో దూసుకెళ్తోంది. ఈ చిత్రం ఓపెనింగ్స్‌లో భారీ స్పందనను రాబడుతోంది. విజయ్ ఒక్కడి పేరే టికెట్ కౌంటర్ల వద్ద జోరు చూపిస్తోంది. యాక్షన్, డ్రామాతో కూడిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. యూఎస్‌లో ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Also Read: Coolie: నార్త్‌లో కూలీకి గ్రాండ్ ప్లాన్!

ట్రైలర్, ప్రమోషనల్ కంటెంట్ హైప్‌ను మరింత పెంచాయి. విజయ్ గత చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించకపోయినా, ‘కింగ్‌డమ్’ మాత్రం విజయ్ పాత ఊపును కొనసాగించేలా కనిపిస్తోంది. ఈ సినిమా రిలీజ్ రోజున ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో వేచి చూడాలి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *