Kingdom : విజయ్ దేవరకొండ హీరోగా, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా దర్శకుడు గౌతమ్ తిన్ననూరి రూపొందిస్తున్న పాన్-ఇండియా చిత్రం ‘కింగ్డమ్’ హైప్‌ను మరో స్థాయికి తీసుకెళ్తోంది. అనౌన్స్‌మెంట్ నాటి నుంచి అంచనాలు రెట్టింపు చేసిన ఈ సినిమా, కొన్ని ఆలస్యాల తర్వాత ఇప్పుడు ఫుల్ జోష్‌లో ఉంది.
తాజాగా విడుదలైన ఫస్ట్ సింగిల్ ఆడియెన్స్‌ను ఊపేసింది. అనిరుద్ రవిచందర్ సమకూర్చిన సంగీతం, గౌతమ్ టేకింగ్‌తో కలిసి సినిమాపై అంచనాలను పీక్స్‌కు తీసుకెళ్లాయి.
Also Read: The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు భారీ సంస్థ ఫండింగ్!
Kingdom: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ భారీ చిత్రం మే 30న పాన్-ఇండియా స్థాయిలో గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ పాజిటివ్ వైబ్స్ కొనసాగితే, విజయ్ దేవరకొండ కెరీర్‌లో భారీ ఓపెనింగ్స్ సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ‘కింగ్డమ్’తో విజయ్ మరోసారి మాస్ హీరోగా రచ్చ చేయడానికి రెడీ అవుతున్నాడు!
కింగ్డమ్ మూవీలో హృదయం లోపల పూర్తి వీడియో సాంగ్ :