Kharge: థరూర్ వ్యాఖ్యలపై ఖర్గే తీవ్ర విమర్శ

Kharge: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ నేత శశిథరూర్ చేసిన ప్రశంసలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఘాటుగా స్పందించారు. “మాకు దేశం మొదటి ప్రాధాన్యం, కానీ కొందరికి మాత్రం మోదీయే ముందు వస్తున్నారు” అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఈ మాటలు, పరోక్షంగా శశిథరూర్‌ను ఉద్దేశించి చేసినవే.

ఇటీవల “ది హిందూ” పత్రికలో ప్రచురితమైన ఓ వ్యాసంలో థరూర్, ప్రధాని మోదీ నాయకత్వాన్ని ప్రశంసిస్తూ, ఆయనలో ఉన్న శక్తి, చైతన్యం, ప్రపంచ వేదికలపై భారతదేశ ప్రతిష్టను పెంచాలన్న తపన భారతదేశానికి ప్రధానమైన ఆస్తిగా నిలుస్తోందని పేర్కొన్నారు. అయితే, దీని వల్ల మోదీకి మరింత మద్దతు అవసరం అని కూడా సూచించారు.

ఈ వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో భిన్నాభిప్రాయాలు కలుగుతున్నాయి. థరూర్ మాటలు పార్టీని తకు గురిచేశాయని, పార్టీ హైకమాండ్ కూడా ఆయనపై అసంతృప్తిగా ఉందని సమాచారం. పార్టీ లైన్‌కు విరుద్ధంగా మాట్లాడినందుకు థరూర్‌కు సంబంధించి వ్యూహాత్మకంగా దూరం పెరుగుతోంది.

మాస్కోలో జరిగిన ఓ సమావేశంలో మాట్లాడిన థరూర్, తన వ్యాసాన్ని బీజేపీలో చేరేందుకు ప్రయత్నంగా చూడకూడదని స్పష్టం చేశారు. దేశ ఐక్యతను ముందుగా ఉంచి, భారత్‌ హితాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ వ్యాసం రాశానన్నారు.

ఈ అంశంపై స్పందించిన ఖర్గే, “శశిథరూర్‌కు మంచి ఇంగ్లీష్‌ అలవాటు. ఆయన మాట్లాడే భాష ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. అందుకే ఆయన్ను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలోకి తీసుకున్నాం” అన్నారు. అయితే, 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయిన పహల్గామ్‌ దాడి తర్వాత ప్రతిపక్షాలన్నీ సైన్యం వెనుక నిలిచాయని గుర్తు చేశారు.

ఖర్గే ఆవేదనతో అన్నారు: “మేము ఎప్పుడూ దేశమే ముందు అన్నాం, కానీ ఇప్పుడు కొందరు వ్యక్తులు ‘మోదీయే ముందు, దేశం తరువాత’ అనే స్థితిలో ఉన్నారు. అటువంటి వారికి మనం చేయగలం?”

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *