Khaleja Re Release: సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో వచ్చిన కల్ట్ క్లాసిక్ ‘ఖలేజా’ మరోసారి థియేటర్లలో సందడి చేయనుంది. అప్పట్లో బాక్సాఫీస్ వద్ద అంచనాలను అందుకోలేకపోయినా, ఇప్పుడు ఈ చిత్రం అభిమానుల హృదయాల్లో సునామీ సృష్టిస్తోంది. మహేష్ ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రేమికులందరూ ఈ సినిమాకు ఏకగ్రీవంగా ఫిదా అవుతున్నారు. రీరిలీజ్‌లో ఈ చిత్రం బుకింగ్స్ మొదటి రోజు నుంచే ఊహించని రికార్డులను నమోదు చేసింది. రిలీజ్‌కు ఇంకా రెండు రోజుల సమయం ఉండగానే, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 6 కోట్ల పైగా ప్రీ సేల్స్ సాధించి, రీరిలీజ్ డే-1లో సరికొత్త బెంచ్‌మార్క్ సెట్ చేసింది. అనుష్క శెట్టి హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో మణిశర్మ సంగీతం, నేపథ్య సంగీతం ప్రేక్షకులను ఇప్పటికీ ఆకట్టుకుంటున్నాయి. ఈ రీరిలీజ్‌తో ‘ఖలేజా’ మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయం!
