Kesari Chapter 2: బాలీవుడ్ ఇటీవలి కాలంలో వరుస హిట్స్‌తో దూసుకెళ్తోంది. ఇందులో ‘ఛావా’ చిత్రం విక్కీ కౌశల్, రష్మిక మందన్నా జోడీతో హిందీతో పాటు తెలుగు డబ్బింగ్ వెర్షన్‌లో విడుదలై భారీ విజయం సాధించింది. లక్ష్మణ్ రామ్ ఉటేకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ హిస్టారికల్ డ్రామా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు మరో బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ ‘కేసరి చాప్టర్ 2’ తెలుగు ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. అక్షయ్ కుమార్, మాధవన్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు కరణ్ సింగ్ త్యాగి తెరకెక్కించారు. హిందీలో బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన ఈ చిత్రం, సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో మే 23న తెలుగు రాష్ట్రాల థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుంది. యాక్షన్, డ్రామాతో కూడిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందన్నది ఆసక్తికరం. బాలీవుడ్ హిట్స్‌కు తెలుగు ఆడియెన్స్ ఆదరణ కొనసాగుతుందా? ఈ సినిమా కూడా ‘ఛావా’లాంటి సక్సెస్ సాధిస్తుందా? వేచి చూడాలి!

