Robotic Elephant

Robotic Elephant: ఆలయంలో రోబో ఏనుగు విన్యాసాలు – తొండంతో భక్తులకు ఆశీర్వాదం!

Robotic Elephant: కేరళలోని ఓ ఆలయంలో రోబో ఏనుగు భక్తుల్ని విశేషంగా ఆకట్టుకుంది. భారీ ఆకారంలో, అచ్చం నిజమైన ఏనుగును పోలిన ఈ యాంత్రిక ఏనుగు చెవులు, తోక ఊపడంతో పాటు భక్తులను తొండంతో ఆశీర్వదించింది. దీన్ని చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చి ఫొటోలు, సెల్ఫీలు తీసుకుంటూ ఆనందించారు. ఈ రోబో ఏనుగుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఏనుగుల వినియోగానికి భద్రతా ప్రత్యామ్నాయం
సాధారణంగా కేరళ ఆలయ ఉత్సవాల్లో ఏనుగులను వినియోగిస్తారు. అయితే ఏనుగుల మానసిక స్థితి మారడం వల్ల కొన్ని సందర్భాల్లో అవి ఆకస్మికంగా ఆగ్రహించాయి. దీని కారణంగా అనేక ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఈ సమస్యకు పరిష్కారంగా, జంతు సంక్షేమ సంస్థ పెటా (PETA) పెరుంకడవిలాలోని బాలభద్రకాళి క్షేత్రం కు రోబో ఏనుగును విరాళంగా అందించింది.

ఈ ఏనుగును ఆలయ సంప్రదాయ ప్రకారం పూజలు నిర్వహించి స్వాగతించారు. భక్తులు దీని వద్ద ఫొటోలు దిగేందుకు పోటీ పడటమే కాకుండా, ఇది భవిష్యత్తులో ఆలయ ఉత్సవాలకు నూతన మార్గదర్శకంగా నిలుస్తుందని అభిప్రాయపడుతున్నారు.

Also Read: War 2: వార్ 2 షూటింగ్‌లో హృతిక్ గాయం.. మూవీ షూటింగ్‌కు బ్రేక్?

Robotic Elephant: పెటా సంస్థ రోబో ఏనుగుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, “దేవీ దాసన్ – సాంకేతిక అద్భుతం. ఇది భవిష్యత్తులో నిజమైన ఏనుగులు వాటి సహజ వాతావరణంలో స్వేచ్ఛగా జీవించేలా మార్గం చూపుతుంది” అని పేర్కొంది.

ఇప్పటికే 2023లో త్రిస్సూర్ జిల్లాలోని ఇరింజడప్పిల్లి కృష్ణ ఆలయం దేశంలోనే తొలిసారిగా రోబో ఏనుగును ప్రవేశపెట్టింది. అప్పటి నుంచి పలు ఆలయాలు ఈ ప్రయత్నాన్ని స్వాగతిస్తున్నాయి. ఆలయాల్లో అసలు ఏనుగులకు బదులుగా రోబో ఏనుగులను వినియోగించేందుకు ముందుకొస్తున్నాయి.

ఈ మార్పు ఆలయ సంప్రదాయాలకు భంగం కలిగించకుండా, జంతు సంక్షేమాన్ని కాపాడే దిశగా మంచి పరిష్కారంగా నిలుస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

 

ALSO READ  Delhi Station Stampede: డాక్టర్ కొంచెం ముందే వచ్చి ఉంటే బాగుండు.. ఢిల్లీ తొక్కిసలాటలో కూతురి తలపై మేకు గుచ్చుకోవడంతో మృతి..

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *