KERALA: నాలుగు రోజుల్లో కేరళకు నైరుతి రుతుపవనాలు

KERALA :తీవ్ర ఎండలు, ఉక్కపోతతో అవస్థలు పడుతున్న దేశ ప్రజలకు భారత వాతావరణ శాఖ శుభవార్త తెలిపింది. మరో నాలుగు నుంచి ఐదు రోజుల్లో నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నట్లు అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం ఈ వానలు శ్రీలంక, అండమాన్-నికోబార్ దీవులపై ప్రభావాన్ని చూపుతున్నాయని, త్వరలోనే కేరళలో ప్రవేశించేందుకు అన్నీ అనుకూల పరిస్థితులున్నాయని తెలిపారు.

సాధారణంగా జూన్ మొదటి వారంలో రుతుపవనాలు కేరళను తాకడం పరిపాటి. అయితే ఈసారి మే నెలాఖరులోనే రుతుపవనాలు అడుగుపెట్టే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. జూలై 8 నాటికి ఇవి దేశవ్యాప్తంగా విస్తరించే అవకాశముందని అంచనా.

వర్షాకాలం ముందుగానే ప్రారంభం కావడం వల్ల, పంటల సాగుకు సిద్ధమవుతున్న రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సమయానికి కురిసే వానలు వ్యవసాయానికి ఎంతో అనుకూలంగా ఉంటాయని ఆశిస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *