Keerthy Suresh: నటి కీర్తి సురేశ్ పెళ్ళి పీటలు ఎక్కబోతున్నట్లు ప్రకటించేసింది. తన చిరకాల మిత్రుడితోనే డిసెంబర్ లో పెళ్ళి పీటలు ఎక్కబోతున్నట్లు తెలియచేసింది కీర్తి. గోవాలో పెళ్ళి పనులు కూడా ఆరంభం అయ్యాయి. కీర్తి హిందువు కాగా తను చేసుకోబోయే వరుడు ఆంటోనీ క్రిష్టియన్. దీంతో రెండు మతాల పద్ధతుల్లో ఈ వివాహం జరగబోతోందట. ఈ విషయంలో కీర్తి సమంతను ఫాలో అవుతోందన్న మాట. గతంలో నాగచైతన్య, సమంత కూడా రెండు మతాల సంప్రదాయాలు పాటించి వివాహమాడారు. అయితే డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్న వారిద్దరూ కొంత కాలానికి విడిపోయారు. సమంత లాగే కీర్తి సురేశ్ వివాహం కూడా రెండు మత సంప్రదాయాల ప్రకారం జరగనుంది. ముందుగా రిసార్ట్స్ లో హిందూ సంప్రదాయం ప్రకారం డిసెంబర్ 12న కీర్తి మెడలో ఆంటోని తాళి కట్టబోతున్నాడు. ఆ తర్వాత అదే రోజు సాయంత్రం గోవాలోని ప్రముఖ చర్చిలో వీరిద్దరూ ఉంగరాలు మార్చుకోనున్నారు. మరి సమంతను ఫాలో అవుతున్న కీర్తి వైవాహిక జీవితం కలకాలం వర్ధిల్లాలని కోరుకుందాం.
