KCR:బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సికింద్రాబాద్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి బుధవారం (ఫిబ్రవరి 19) వెళ్లారు. ఆయన తన పాస్‌పోర్ట్‌ను రెన్యువల్ చేసుకోవడం కోసం ఆయన వెళ్లారు. ఇప్పుడు ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది. ఎందుకంటే ఆయన త్వరలో అమెరికాకు వెళ్లొస్తారనే ప్రచారం జరుగుతుండగా, ఇప్పుడు ఈ విషయం తెలియడంతో చర్చనీయాంశంగా మారింది.
KCR:ఇదేరోజు హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో జరిగే బీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. ఈ మేరకు ఎర్రవల్లిలోని తన ఫాంహౌజ్ నుంచి తన సతీమణితో కలిసి బయలుదేరిన కేసీఆర్ నేరుగా సికింద్రాబాద్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి చేరుకున్నారు. ఇప్పటివరకు ఉన్న డిప్లమాటిక్ పాస్‌పోర్ట్‌ను కార్యాలయంలో అందజేసి, సాధారణ పాస్‌పోర్ట్‌ను రెన్యువల్ చేసునేందుకు కార్యాలయానికి వచ్చినట్టు అధికార వర్గాలు తెలిపాయి.
KCR:కేసీఆర్‌తోపాటు ఆయన సతీమణి శోభమ్మ, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోశ్‌కుమార్ కార్యాలయానికి వెళ్లారు. దాదాపు అరగంట పాటు రెన్యువల్ ప్రక్రియ జరగింది. పాస్‌పోర్ట్ రెన్యువల్ అనంతరం కేసీఆర్ సహా వారంతా నందినగర్‌లోని నివాసానికి బయలుదేరి వెళ్లారు. అక్కడి నుంచే ఆయన విశ్రాంతి తీసుకొని, మధ్యాహ్నం 2 గంటల తర్వాత తెలంగాణ భవన్‌కు వెళ్లనున్నారు.
KCR:నెల రోజుల తర్వాత కేసీఆర్ అమెరికా వెళ్లనున్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి పదేండ్లపాటు పనిచేసిన కేసీఆర్.. అంతకు ముందు కానీ అమెరికా గడప దొక్కిన దాఖలాలు లేవు. ప్రస్తుతం కేసీఆర్ మనుమడైన హిమాన్షు అమెరికాలో ఉంటున్నారు. ఆయన వినతి మేరకు కేసీఆర్ అమెరికాకు వెళ్లనున్నట్టు తెలిసింది.