KCR: జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భౌతికకాయానికి బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆదివారం నివాళులర్పించారు. మాదాపూర్‌లోని మాగంటి నివాసానికి చేరుకున్న కేసీఆర్, పుష్పగుచ్ఛం ఉంచి మృతదేహానికి నివాళులు అర్పించారు. మాగంటి మరణాన్ని చూసి భావోద్వేగానికి లోనైన ఆయన, కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ కష్ట సమయంలో కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
Live: ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ పార్థివ దేహానికి నివాళి అర్పిస్తున్న బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. https://t.co/lyGtihkFJr
— BRS Party (@BRSparty) June 8, 2025