KCR

KCR: కేసీఆర్‌ విజ్ఞప్తిని అంగీకరించిన కాళేశ్వరం కమిషన్… విచారణ ఎప్పుడంటే?

KCR: కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నిర్మాణంలో భాగంగా నిర్మించిన అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై జరుగుతున్న విచారణలో కీలక మలుపు వచ్చింది. జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని కమిషన్ ఇప్పటికే బ్యారేజీల డిజైన్, నిర్మాణ నాణ్యత, ఖర్చులపై విచారణ జరుపుతోంది.

ఈ దర్యాప్తులో పలు శాఖల ఉన్నతాధికారులు, నిర్మాణ కంపెనీల ప్రతినిధులను కమిషన్ ఇప్పటికే విచారించింది. వీరంతా ముఖ్యమంత్రి సమక్షంలోనే నిర్ణయాలు జరిగాయని చెప్పటంతో, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) కు కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఇక మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటల రాజేందర్‌లకు కూడా కమిషన్ నోటీసులు జారీ చేసింది.
కమిషన్ మొదటగా కేసీఆర్‌ను జూన్ 5న, హరీష్ రావును జూన్ 6న, ఈటలను జూన్ 9న హాజరు కావాలని సూచించింది. అయితే, కేసీఆర్ విజ్ఞప్తి మేరకు విచారణ తేదీ జూన్ 11కు మార్చబడింది. దీంతో కేసీఆర్ ఇప్పుడు జూన్ 11న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట విచారణకు హాజరుకానున్నారు.

KCR: ఇక బీఆర్ఎస్ వర్గాలు దీనిపై తీవ్రంగా స్పందించాయి. కేసీఆర్‌కు నోటీసులు పంపడాన్ని కక్షపూరిత చర్యగా అభివర్ణించాయి. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టుపై అవసరమైన సమాచారం అందించామని, అయినా రాజకీయ ప్రతీకారం కోణంతో విచారణ జరుపుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశాయి.
కమిషన్ మాత్రం పూర్తి విచారణ అనంతరం నిజాలు వెలుగులోకి వస్తాయని స్పష్టం చేస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో చోటుచేసుకున్న వ్యయాలు, నిర్మాణ ప్రమాణాలు, బాధ్యత వహించిన అధికారుల నిర్ణయాలు అన్నింటినీ పరిశీలిస్తామని తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *