KCR: తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) గచ్చిబౌలి AIG ఆసుపత్రిలో వైద్య పరీక్షల కోసం వెళ్లారు. ఎర్రవల్లి ఫామ్‌హౌస్ నుంచి గురువారం ఉదయం హైదరాబాద్‌కు వచ్చిన ఆయన, అక్కడి నుంచి ఆసుపత్రికి చేరారు.
కేసీఆర్ ఆరోగ్య పరీక్షలు రెగ్యులర్‌గా నిర్వహించుకుంటూ ఉంటారు. ఈసారి కూడా మామూలు వైద్య పరీక్షల క్రమంలోనే కొన్ని టెస్టులు చేయించుకోవడానికి ఆసుపత్రికి వెళ్లినట్టు సమాచారం. గతంలో వెన్ను నొప్పితో బాధపడిన నేపథ్యంలో ఈసారి కూడా కొన్ని ప్రత్యేక పరీక్షలు జరగొచ్చని వైద్య వర్గాలు పేర్కొంటున్నాయి.
కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సమీప వర్గాలు వెల్లడించాయి. వైద్య పరీక్షల అనంతరం ఆయన తిరిగి ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కు చేరనున్నట్లు సమాచారం.

