Nara Lokesh: తెలంగాణ రాజకీయ వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేసిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి నేపథ్యంలో, ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు పలువురు ప్రముఖులు మాదాపూర్‌లోని నివాసానికి చేరుకున్నారు. ముఖ్యంగా, బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) మరియు టీడీపీ నేత నారా లోకేష్ ఇద్దరూ ఒకేసారి మాగంటి కుటుంబాన్ని పరామర్శించారు.
మాగంటి గోపీనాథ్ పార్థివదేహానికి కేసీఆర్ నివాళులు అర్పించగా, ఆయన భౌతికకాయం చూసి కంటతడి పెట్టిన దృశ్యం హృదయాన్ని కలిచివేసింది. మాగంటి కుటుంబసభ్యులను ఓదార్చిన కేసీఆర్, వారి బాధను దగ్గరుండి పంచుకున్నారు. అదే సమయంలో నారా లోకేష్ కూడా అక్కడే ఉండగా, ఇద్దరూ పక్కపక్కనే కూర్చుని మాగంటి కుటుంబాన్ని పరామర్శించారు. రాజకీయ భిన్నాభిప్రాయాలకు అతీతంగా, మానవతా దృక్పథంతో వారు చూపిన సానుభూతి అందరికీ స్పూర్తిదాయకంగా నిలిచింది.
మాగంటి గోపినాధ్ కుటుంబసభ్యులను పరామర్శించిన కేసీఆర్, నారా లోకేష్ https://t.co/laifB8W5GP pic.twitter.com/QKNSTBp0Jv
— Telugu Scribe (@TeluguScribe) June 8, 2025