Mirai: హనుమాన్ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న తేజ సజ్జా.. ఇప్పుడు ‘మిరాయ్’ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో సందడి చేయనున్నారు. సూపర్ హీరో యాక్షన్ అడ్వెంచర్ జోనర్ లో రూపొందుతున్న ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నారు. రితికా నాయక్ హీరోయిన్ గా, మంచు మనోజ్ విలన్ గా నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి గౌరవ్ హరి సంగీతం అందిస్తున్నారు. టీజర్ తోనే సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది. జులై 26న ఫస్ట్ సింగిల్ రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే, బాలీవుడ్ లో ప్రముఖ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ ఈ ప్రాజెక్ట్ లో భాగస్వామ్యం కానుందని సమాచారం. కరణ్ జోహర్ సహ నిర్మాతగా చేరే అవకాశం ఉందని టాక్. బాహుబలి, దేవర వంటి చిత్రాలతో సౌత్ సినిమాలకు బాలీవుడ్ లో బలం చేకూర్చిన ధర్మ ప్రొడక్షన్స్.. మిరాయ్ తో మరో హిట్ కొట్టేందుకు సిద్ధమవుతోందా? సెప్టెంబర్ 5న విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.
