Kannappa: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించారు. అవా ఎంటర్ టైన్ మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పై ముఖేష్కుమార్ సింగ్ దర్శకత్వంలోడా. మోహన్ బాబు నిర్మిస్తున్న ‘కన్నప్ప’ చిత్రాన్ని ఏప్రిల్25న రిలీజ్ చేస్తున్నట్లు తెలియచేశారు. ప్రస్తుతం ద్వాదశ జ్యోతిర్లింగాల సందర్శనలో ఉంది ‘కన్నప్ప’ టీమ్. అందులో భాగంగా ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించాడు మంచు విష్ణు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్స్ తో పాటు గ్లింప్స్, టీజర్ కి మంచి స్పందన అభించింది. హాలీవుడ్ సాంకేతిక నిపుణులతో అంతర్జాతీయ స్థాయిలో ఈ సినిమాను రూపొందిస్తున్నామని, న్యూజిలాండ్ లో అందాలతో ఈ సినిమా విజువల్ ట్రీన్ ఇస్తుందని అంటున్నారు. రిలీజ్ లోపు పన్నెండు జ్యోతిర్లింగాలను దర్శించుకుంటామని, ఇకపై వచ్చే ‘కన్నప్ప’ అప్ డేట్స్ సినిమాపై అంచనాలను మరింతగా పెంచుతాయంటున్నారు విష్ణు. ‘కన్నప్ప’లో మోహన్ బాబు, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, ప్రభాస్, శరత్ కుమార్, మధుబాల, దేవరాజ్, ముఖేష్ రుషి, మంచు అవ్రామ్, అర్పిత్ రంకా, బ్రహ్మానందం నటిస్తున్నారు.

