Kannappa: మంచు విష్ణు కార్యాలయాల్లో జీఎస్టీ అధికారుల సోదాలు

Kannappa: ప్రముఖ సినీ నటుడు మంచు విష్ణుకు చెందిన కార్యాలయాల్లో బుధవారం జీఎస్టీ ఇంటెలిజెన్స్ శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్‌లోని మాదాపూర్, కావూరి హిల్స్ ప్రాంతాల్లో ఉన్న ఆయన కార్యాలయాలపై రెండు ప్రత్యేక బృందాలు ఏకకాలంలో సోదాలకు దిగాయి.

ఈ తనిఖీలు ముఖ్యంగా ‘కన్నప్ప’ సినిమా నిర్మాణానికి సంబంధించిన జీఎస్టీ చెల్లింపుల విషయంలో అనుమానాస్పద లావాదేవీలు ఉన్నాయనే పద్దతిలో జరుగుతున్నట్లు సమాచారం. సంబంధిత ఆర్థిక లెక్కలన్నింటిని అధికారులు సమగ్రంగా పరిశీలిస్తున్నారు.

సోదాల సమాచారం తెలియగానే, మంచు విష్ణు తండ్రి, సీనియర్ నటుడు మోహన్ బాబు కూడా కార్యాలయానికి చేరుకొని అధికారులతో మాట్లాడారు.

ఈ ఘటనపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా విష్ణు స్పందిస్తూ,

“మీరు చెబుతున్నంత వరకు ఈ విషయమై నాకు స్పష్టత లేదు. అయినా దాచాల్సిన అవసరం ఏమీ లేదు. ఎక్కడెక్కడ అప్పులు చేశామో ఈ తనిఖీల వల్ల మనకే తెలుస్తుంది!” అని వ్యాఖ్యానించారు.

అంతేకాకుండా ఆయన ‘కన్నప్ప’ సినిమాపై కూడా మాట్లాడారు.

“ఇటీవలే హిందీ వెర్షన్ ఫైనల్ కాపీ చూశాను. చివరి సన్నివేశాల్లో కొందరు ప్రముఖుల రోమాలు నిక్కబొడుచుకున్నాయట. అదే అనుభూతి ప్రేక్షకులకు కూడా కలుగుతుందని ఆశిస్తున్నాను. ఇది దేవుడి భక్తుడికి మధ్య ఉండే పవిత్రమైన కథ. కన్నప్ప మహాత్మ్యాన్ని ఈ తరం యువతకు తెలియజేయాలన్నదే మా ఉద్దేశం,” అని అన్నారు.

ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ పౌరాణిక చిత్రంలో విష్ణు స్వయంగా కన్నప్ప పాత్రలో నటిస్తున్నారు. ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, మోహన్ బాబు, కాజల్ అగర్వాల్ వంటి స్టార్ నటులు ఇందులో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

 

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  P. Susheela: తొలి జాతీయ ఉత్తమ గాయని

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *