Emergency: జాతీయ ఉత్తమ నటి కంగనా రనౌత్ నటించి, దర్శకత్వం వహించిన సినిమా ‘ఎమర్జెన్సీ’. 1975లో అప్పటి భారత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని పెట్టిన నేపథ్యంలో ఈ సినిమా రూపుదిద్దుకుంది. ఈ నెల 17న మూవీ జనం ముందుకు వస్తున్న సందర్భంగా తాజాగా మేకర్స్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇందులో అనుపమ్ ఖేర్ లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ పాత్రను పోషించగా, శ్రేయాస్ తల్సాడే వాజ్ పాయ్ పాత్రలో కనిపించబోతున్నారు. పలు వివాదాలను అధిగమించి ఎట్టకేలకు కంగనా ‘ఎమర్జెన్సీ’ సినిమాను విడుదల చేయబోతోంది.