Kamareddy: కామారెడ్డి సదాశివనగర్ మండలంలో విషాదం చోటుచేసుకుంది. అడ్లూరు ఎల్లారెడ్డి పెద్దచెరువులో దూకి ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు . మృతులను ఎస్‌ఐ సాయికుమార్, కానిస్టేబుల్ శృతి, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్‌గా గుర్తించారు . భిక్కనూరు పీఎస్ ఎస్‌ఐగా పనిచేస్తున్న సాయికుమార్, బీబీపేట పీఎస్ కానిస్టేబుల్ శృతి, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్టుగా భావిస్తున్నారు. ముగ్గురిలో కానిస్టేబుల్ శృతి, నిఖిల్ మృతదేహాలు దొరికాయి . అయితే , ఎస్ఐ సాయి కుమార్ మృతదేహం దొరకలేదు . దీంతో సాయికుమార్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు . పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది .
ఈ వార్త అప్ డేట్ అవుతోంది . .