KALKI 2898 AD

KALKI 2898 AD: కల్కి వివాదం.. నిర్మాతను మోసం చేసిన డిస్ట్రిబ్యూటర్స్!

KALKI 2898 AD: గ్లోబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, హాట్ బ్యూటీ దీపికా పదుకొణె నటించిన బ్లాక్ బస్టర్ మూవీ కల్కి 2898 ఏడీ. స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రూ.1000 కోట్ల మేర కలెక్షన్స్ రాబట్టింది. అయితే, తాజాగా ఈ సినిమా వాటాలపై వివాదం నెలకొన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మూవీపై యూఎస్, యూరప్ పంపిణీదారుల మధ్య వివాదం నెలకొంది. వాటాల పంపిణీలో నిర్మాతలు, డిస్ట్రీబ్యూటర్ల మధ్య పరసర్పం గొడవ జరిగినట్టు సమాచారం. ఈ మేరకు వైజయంతి మూవీస్ ప్రొడక్షన్ హౌస్ నుంచి యూఎస్, యూరప్ డిస్ట్రిబ్యూటర్స్ కి మెయిల్ వచ్చింది. ప్రస్తుతం ఆ మెయిల్ ఎక్స్ లో లీకైంది. అయితే పొడ్రక్షన్ హౌస్ నుంచి వచ్చిన ఆమెయిల్ నిజమేనని.. అసలు వివాదం ఏంటో వివరించాయి. “యూఎస్, యూరప్ డిస్ట్రిబ్యూటర్లు నిర్మాతలను మోసం చేశారు.

KALKI 2898 AD: ట్రేడ్స్ ప్రకారం ఈ చిత్రం 1.3 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. నిర్మాతలకు వారు కేవలం రూ. 5 కోట్లు అడ్వాన్ గా ఇచ్చారు. ఇప్పుడు కేవలం రూ. 3 కోట్లు మాత్రమే సంపాదించామని అంటున్నారు. దీంతో నిర్మాతలు ఇప్పుడు చట్టబద్ధంగా ముందుకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే వారికి వేరే మార్గం లేదు. తాము పంపిన మెయిల్ కు కూడా పంపిణీదారులు స్పందించలేదు. పైగా దానిని సోషల్ మీడియాలో లీక్ చేశారు. చట్టపరంగా ముందుకు వెళ్లే ముందు వారి స్పందన కోసం వేచి చూస్తున్నారు’ అని పేర్కొన్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Shammi Kapoor: ఫష్ట్ రాక్ స్టార్ ఆఫ్‌ ఇండియా షమ్మీకపూర్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *