Kalki 2: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 ఎ.డి.’ మూవీ వెయ్యి కోట్ల క్లబ్ లో చేరడంతో దాని సీక్వెల్ పైనా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్ ను నిర్మాతలు స్వప్న, ప్రియాంక ఇఫీలో ఇచ్చారు. సీక్వెల్ కు సంబంధించిన 35 శాతం షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యిందని, మిగిలిన భాగం షూటింగ్ కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోందని అన్నారు. అతి త్వరలోనే తిరిగి సినిమా షూటింగ్ మొదలు పెడతామని అన్నారు. ఇదిలా ఉంటే… ప్రభాస్ ‘సలార్’ సీక్వెల్ షూటింగ్ లోనూ పాల్గొంటున్నారు. ఆ రకంగా ఆయనకు సంబంధించిన రెండు సీక్వెల్ మూవీస్ సెట్స్ పై ఉన్నాయి.