Kajol: హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీ భారతీయ సినీ పరిశ్రమకు గర్వకారణం. ఇక్కడ షూటింగ్ చేయాలని దర్శకులు, నిర్మాతలు ఆసక్తి చూపుతారు. అయితే, బాలీవుడ్ నటి కాజోల్ ఇటీవల ఈ ఫిలిం సిటీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. రాత్రిపూట అక్కడ ఉండటానికి భయంగా ఉందని, ఏవో భయానక శక్తులు ఉన్నాయని తెలిపింది. ఈ కామెంట్స్‌తో తెలుగు ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.తాజాగా, కాజోల్ తన వ్యాఖ్యలపై స్పష్టతనిచ్చింది. తన తాజా చిత్రం ‘మా’ ప్రచారంలో భాగంగా ఆ మాటలు చెప్పానని, రామోజీ ఫిలిం సిటీలో గతంలో అనేక సినిమాలు చేశానని తెలిపింది. అక్కడి వృత్తిపరమైన వాతావరణం అద్భుతమని, పర్యాటకులు, కుటుంబాలు, పిల్లలు సంతోషంగా గడుపుతారని కొనియాడింది. ఈ వివరణతో వివాదం కొంత తగ్గినప్పటికీ, ఆమె తప్పుడు వ్యాఖ్యలపై విమర్శలు గుప్పిస్తున్నారు నెటిజన్స్.
 
							
