Kajal Aggarwal: ఒకప్పటి టాప్ హీరోయిన్ గా దూసుకుపోయింది కాజల్ అగర్వాల్. అయితే ప్రస్తుతం ఆమె చేతిలో సినిమాలేవి లేకపోవడం గమనార్హం. టాలీవుడ్‌లో స్టార్ స్థాయి దక్కించుకున్న ఆమె ఇప్పుడు వెబ్ సిరీస్‌లో నటించేందుకు రెడీ అవుతున్నారు. హిందీ ‘ఆర్య’ తెలుగు రీమేక్‌లో లీడ్ రోల్ చేయనున్నారు.
Also Read: The Raja Saab: ఓవర్సీస్‌లో రాజాసాబ్ సునామీ!
టాలీవుడ్‌లో దాదాపు దశాబ్దకాలం టాప్ హీరోయిన్‌గా రాణించిన కాజల్ అగర్వాల్ ప్రస్తుతం చేతిలో తెలుగు సినిమాలు లేకపోవడం ఆసక్తికరం. ‘లక్ష్మీ కళ్యాణం’ చిత్రంతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన కాజల్ తర్వాత అనేక హిట్ సినిమాల్లో నటించి స్టార్ స్థాయికి ఎదిగారు. సమంత, తమన్నా, అనుష్క వంటి హీరోయిన్లతో పోటీ పడి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే కొన్నేళ్లుగా సరైన అవకాశాలు రాకపోవడం, పెళ్లి అనంతరం ఛాన్సులు మరింత తగ్గిపోవడంతో ఆమె కెరీర్ నెమ్మదిగా మారింది. చేసిన కొన్ని సినిమాలు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. ప్రస్తుతం చేతిలో ఒక్క తెలుగు చిత్రం కూడా లేదు. ఈ నేపథ్యంలో కాజల్ రూటు మార్చి వెబ్ సిరీస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. హిందీలో సూపర్ హిట్ అయిన ‘ఆర్య’ వెబ్ సిరీస్‌ను తెలుగులో రీమేక్ చేసేందుకు జియో హాట్ స్టార్ ప్లాన్ చేస్తోంది. ఈ సిరీస్‌లో కాజల్ లీడ్ రోల్ పోషించేందుకు సుముఖంగా ఉన్నట్లు సమాచారం. మరి ఈ సిరీస్ కాజల్ కి ఎలాంటి బ్రేక్ ఇస్తుందో చూడాలి.

