KA

KA: ‘క’ చిత్రం సెన్సార్ పూర్తి, యు/ఎ 13 ప్లస్‌!

KA: ఈ మధ్య కేంద్ర సమాచార ప్రసారశాఖ సెన్సార్ సర్టిఫికెట్ లో కొన్ని మార్పులు చేర్పులు చేసింది. యు/ఎ సర్టిఫికెట్ లోనూ మూడు కేటగిరిలను పెట్టింది. పెద్దలతో కలిసి పిల్లలు చూసే చిత్రాలకు యు/ఎ సర్టిఫికెట్ ఇస్తారు. అయితే తమతో పాటు ఏ వయసు పిల్లలను ఈ సినిమాలకు తీసుకెళ్ళ వచ్చు అనే విషయంలో కొంత క్లారిఫికేషన్ ఇచ్చిందని అనుకోవచ్చు. అందులో భాగంగా యు/ఎ 7ప్లస్, యు/ఎ 13 ప్లస్, యు/ఎ 16 ప్లస్ కేటగిరిలను పెట్టింది. ఇది కేవలం సి.బి.ఎఫ్.సి. నుండి ఓ సూచన మాత్రమే. పెద్దలు దీనిని ఖచ్చితంగా పాటించాల్సిన పనిలేదు. థియేటర్లలో పిల్లల ఏజ్‌ ప్రూఫ్ ను ఎవరూ అడగరు. ఇప్పటి వరకూ తెలుగులో ఏ సినిమా ఇలా వివిధ కేటగిరిల్లో సర్టిఫికెట్స్ ను పొందలేదు. కిరణ్‌ అబ్బవరం నటించిన ‘క’ సినిమా నుండి తెలుగులోనూ ఈ తరహాలో సర్టిఫికెట్ జారీ చేయడం మొదలైంది. ‘క’ చిత్రానికి యు/ఎ 13 ప్లస్ కేటగిరిలో సర్టిఫికెట్ ను జారీ చేశారు. ఈ నెల 31న జనం ముందుకు రాబోతున్న ‘క’లో ‘ఆయ్’ ఫేమ్ నయన్ సారిక హీరోయిన్ గా నటించగా, మలయాళీ భామ తన్వీరామ్ కీలక పాత్రను పోషించింది. ఈ సినిమాతో సుజిత్, సందీప్ దర్శకులుగా పరిచయం అవుతున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Mehaboob Dilse: నువ్వే కావాలి’ అంటున్న బిగ్ బాస్ ఫేమ్ మెహబూబ్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *