K lakshman: బీసీ బిల్లుపై మోసం చేస్తోంది రేవంత్ ప్రభుత్వం

K lakshman: తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసే ఉద్దేశంతో ప్రభుత్వముంటే, ఆ బిల్లును కేంద్రానికి పంపించి 9వ షెడ్యూల్‌లో చేర్చాలని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ పేర్కొన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం బిల్లును రాష్ట్రపతికి పంపిందని, ఇది ప్రజలను మోసం చేయడమేనని ఆయన విమర్శించారు.

“రిజర్వేషన్లను చట్టబద్ధంగా అమలు చేయాలంటే 9వ షెడ్యూల్‌లో చేర్చాల్సిందే. కానీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని తప్పించుకుని రాష్ట్రపతికి పంపింది. రాష్ట్రపతి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియదు. తమిళనాడు రిజర్వేషన్లపై ఇప్పటికే సుప్రీంకోర్టులో కేసు ఉంది. అయినా ఇలాంటి నాటకాలు ఎందుకు?” అని ఆయన ప్రశ్నించారు.

అలాగే, “90 శాతం ముస్లింలను బీసీ కోటాలో చేర్చడం రోల్ మోడల్ అవుతుందా?” అని మండిపడ్డారు.

“హైదరాబాద్‌లో 50 కార్పొరేషన్లు ఉన్నాయి. కానీ స్థానిక సంస్థల ఎన్నికలు జరిపించకుండా ప్రజాప్రాతినిధ్యాన్ని ఖాతరు చేస్తున్నారన్నారు.”

హైకోర్టు ఇప్పటికే స్థానిక సంస్థలపై కీలక తీర్పు ఇచ్చినప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.

గ్రామాల్లో అభివృద్ధి ఆగిపోయిందని, పలు బిల్లులు కూడా సర్పంచులకు చెల్లించలేదని, పలువురు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నెలకొందన్నారు.

“సమయానికి ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు ఇతరులపై నెపం నెట్టేస్తున్నారు. రాష్ట్రపతికి బిల్ పంపించాం అని చెప్పడం చట్టపరంగా సరైన మార్గం కాదు” అని డా. లక్ష్మణ్ విమర్శించారు.

ఎమర్జెన్సీ దినోత్సవం నేపథ్యంగా కూడా ఆయన మాట్లాడారు.

“ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించడంతో దేశంలో ప్రజాస్వామ్యం తుడిచిపెట్టే పరిస్థితి వచ్చింది. మోదీ ప్రభుత్వం ఈ చీకటి రోజును ‘సంవిధాన్ హత్యా దినం’గా నిర్వహిస్తోంది. నేటి తరానికి ఆ నిజాలు తెలియాలి,” అన్నారు.

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కూడా స్పందించిన ఆయన,

“నాది కూడా ట్యాపింగ్ జరిగి ఉండొచ్చు. నిజంగా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంటే, ఈ కేసును సీబీఐకి అప్పగించాలి” అని డిమాండ్ చేశారు.

అంతేకాకుండా, కేంద్ర ప్రభుత్వ సంస్థల భూములపై రాష్ట్రం చూపిన ఉత్సాహం రాష్ట్ర భూములపై ఎందుకు లేదని ప్రశ్నించారు.

“కేంద్ర భూములు కావాలి అంటున్నారు. తీసుకున్నాక అమ్మేస్తారా? ముందు రాష్ట్ర భూములను రక్షించండి,” అని సూచించారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకం విషయానికొస్తే,

“కొత్తవాళ్లు, పాతవాళ్లు అన్న భేదం లేదు. జూలై రెండో వారంలో కొత్త రాష్ట్ర అధ్యక్షుడు నియమితులవుతారు. అనంతరం జాతీయ అధ్యక్షుడి నియామక ప్రకటన ఉంటుంది,” అని స్పష్టం చేశారు.

ALSO READ  America: గాలిలో ఉండ‌గానే బోయింగ్ విమానానికి మంట‌లు.. పైల‌ట్ చేసిన పనికి..

 

 

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *