Jurala Project:ఈసారి ముందస్తు రుతు పవనాల రాకతోపాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రైతులకు ముందస్తు శుభవార్త అందింది. తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండగా, రెండు తెలుగు రాష్ట్రాలకు వరప్రదాయిని అయిన కృష్ణమ్మకు కూడా వరద పోటెత్తుతున్నది. ఎగువన ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు కృష్ణానదిలో వరద రోజురోజుకూ పెరుగుతున్నది.
Jurala Project:ఈ నేపథ్యంలో భారీ వరదలతో కృష్ణానదిపై ఉన్న జూరాల ప్రాజెక్టు నిండు కుండలా మారింది. దీంతో మొత్తం 12 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. పైనుంచి వస్తున్న వరదల కారణంగా మహబూబ్‌నగర్ లో ఉన్న ప్రాజెక్టు పూర్తిగా నిండిపోయింది. జూరాలకు ఇన్‌ఫ్లో 80 వేల క్యూసెక్కుల వరకు వస్తున్నట్టు అధికారులు తెలిపారు.
Jural Project:జూరాల నుంచి దిగువకు సుమారు లక్ష క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ఈ వరదనీరు నేరుగా శ్రీశైలం జలాశయానికి చేరుతున్నది. ఇదే వరద ప్రవాహం పెరిగితే సకాలంలో శ్రీశైలం, నాగార్జున సాగర్ రిజర్వాయర్లు నిండుతాయన్న ఆశాభావం రైతుల్లో నిండుకున్నది.

