Jupelli krishna rao: BRS భూస్థాపితం ఖాయం

Jupelli krishna rao: ఉప ఎన్నిక ఫలితాల నేపథ్యంలో మంత్రి జూపల్లి కృష్ణారావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నిక ఏదైనా గెలుపు కాంగ్రెస్‌దే అని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమానికి ప్రజ‌లు ప‌ట్టంకట్టారని ఆయన పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడి దిశానిర్దేశంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల స‌మిష్టి కృషి ఫ‌లిత‌మే ఈ విజ‌యం అని జూపల్లి అభినందించారు.

బీఆర్ఎస్ చేసిన అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మలేదని విమర్శించారు. ప్రజలు నిజం, నమ్మకం, అభివృద్ధి వైపు నిలిచారని అన్నారు. ఉప ఎన్నికలో గెలిచిన నవీన్‌యాద‌వ్‌కు జూపల్లి శుభాకాంక్షలు తెలిపారు.

ఆయన మాట్లాడుతూ, స్థానిక ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ భూస్థాపితం కావడం ఖాయమని తీవ్ర విమర్శలు చేశారు. ప్రజలు ఇప్పటికే దిశ నిశ్చయించారని, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభావం మరింత పెరుగుతుందని జూపల్లి ధీమా వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *