Judgement:మైనర్ బాలికకు ఐ లవ్ యూ చెప్పిన యువకుడి కేసులో న్యాయస్థానం సంచలన తీర్పునిచ్చింది. ఈ తీర్పుతో నిందితుడికి శిక్ష నుంచి విముక్తి కలిగింది. అంతకు ముందే నిందితుడైన ఆ యువకుడికి కింది కోర్టు మూడేండ్ల జైలు శిక్షను విధిస్తూ తీర్పునిచ్చింది. ఈ మేరకు కింది కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు కొట్టి వేసింది.
Judgement:2015వ సంవత్సరం అక్టోబర్ నెలలో మహారాష్ట్రలోని ఓ ప్రాంతానికి చెందిన మైనర్ బాలిక 11వ తరగతి చదవుతున్నది. ఆ బాలికకు సమీప ప్రాంతంలో ఉండే ఓ యువకుడు ఐ లవ్ యూ అని చెప్పాడు. ఆ తర్వాత ఐ లవ్ యూ చెప్పడమే కాకుండా తమ కూతురును ఆ యువకుడు లైంగికంగా వేధించాడని ఆరోపిస్తూ ఆ మైనర్ బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Judgement:ఈ మేరకు 2017వ సంవత్సరం ఆగస్టు నెలలో మహారాష్ట్రలోని నాగపూర్ సెషన్స్ కోర్టులో విచారణ జరిగింది. విచారణ అనంతరం ఆ యువకుడికి కోర్టు మూడేండ్ల జైలు శిక్షను, రూ.5,000 జరిమానాను విధిస్తూ తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ యువకుడి తల్లిదండ్రులు బాంబే హైకోర్టును ఆశ్రయించారు.
Judgement:బాంబే హైకోర్టులో విచారణ సమయంలో న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఆ యువకుడి నోటి నుంచి ఐ లవ్ యూ అనే పదం వచ్చినంత మాత్రాన అది లైంగిక వేధింపు కాదని కోర్టు పేర్కొన్నది. అతను ఎలాంటి లైంగిక వేధింపులకు పాల్పడ్డట్టు ఆధారాలు కూడా లేవని తేల్చి చెప్పింది. ఈ మేరకు నాగపూర్ సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పున బాంబే హైకోర్టు కొట్టివేసింది.

