Jubliee hills: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధం

Jubliee hills: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో రేపు (మంగళవారం) ఉప ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ సందర్భంగా ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. యూసఫ్‌గూడలోని డీఆర్‌సీ సెంటర్‌లో ఎన్నికల సిబ్బందికి ఈవీఎంలు, పోలింగ్ స్టేషన్లు కేటాయించారు. సిబ్బంది సాయంత్రం లోగా పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటారు.

జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ పోలింగ్ ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. డ్రోన్ల ద్వారా భద్రత పర్యవేక్షణ చేయనున్నట్లు ఆయన తెలిపారు. ప్రతి అభ్యర్థికి ఒక్కో పోలింగ్ ఏజెంట్ పాస్ ఇచ్చినట్లు పేర్కొన్నారు.

ఈ ఉప ఎన్నికపై తెలంగాణ రాష్ట్రం అంతా ఆసక్తిగా గమనిస్తోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఓటర్లు ఎవరికి పట్టం కడతారో ఈ నెల 14న ఫలితాలు వెలువడినప్పుడు తెలుస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *