Jr NTR's 'Dragon' heads to Jordan for major action sequences

NTR: జోర్డాన్‌ కి ఎన్టీఆర్.. కొత్త మేక్ఓవర్ తో అదరకోటినా జూనియర్

NTR: దేవర సినిమా తర్వాత ఎన్టీఆర్ లుక్స్ మీద సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి. కానీ ఎన్టీఆర్ నయా లుక్స్‌తో సోషల్ మీడియాలో వచ్చిన ట్రోల్స్ అన్నింటికీ సమాధానం చెప్పారు. ‘డ్రాగన్’ కొత్త షెడ్యూల్‌లో పాల్గొనడానికి వెళ్తున్న ఎన్టీఆర్ వీడియో చూసిన అభిమానులు.. “ఇది కదా స్టైలిష్ లుక్ అంటే!” అంటూ కామెంట్ చేస్తున్నారు.

ఆర్ఆర్ఆర్ (RRR) సినిమాతో ఇటు ఇండియా, అటు హాలీవుడ్‌లోనూ తన క్రేజ్ పెంచుకున్నాడు ఎన్టీఆర్. ఆ తర్వాత వచ్చిన దేవర సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి సోలోగా నార్త్ మార్కెట్ పెంచుకున్నాడు. వెంటనే బాలీవుడ్ స్పై యూనివర్స్‌లో భాగమైన వార్-2 సినిమాలో హృతిక్ రోషన్‌తో నటించిన సంగతి తెలిసిందే. కానీ ఈ సినిమా బాలీవుడ్‌లోనే కాదు, టాలీవుడ్‌లో కూడా ఆశించిన రేంజ్ లో ఆడలేదు.

కానీ అభిమానులు ఈ పరాజయంతో బాధపడలేదు. ఎందుకంటే ప్రశాంత్ నీల్ తో చేసే సినిమా పక్కా బ్లాక్ బస్టర్ అనే నమ్మకంతో ఉన్నారు. దానికి తగ్గట్టుగానే ఎన్టీఆర్ కూడా ఈ సినిమా కోసం ప్రాణం పెడుతున్నాడు. యాక్టింగ్‌లోనే కాదు, మేకోవర్‌లో కూడా డిఫరెన్స్ చూపిస్తున్నాడు. తాజాగా జోర్డాన్‌లో భారీ యాక్షన్ సీక్వెన్స్ తీయనున్నారు. దాదాపు రెండు వారాలు ఉండే ఈ షెడ్యూల్‌లో మలయాళ నటుడు టోవినో థామస్ కూడా పాల్గొననున్నారు.

అక్కడ షూటింగ్ పూర్తి చేసుకున్న తర్వాత హైదరాబాద్‌లో నెక్స్ట్ షెడ్యూల్ చేయడానికి ప్లాన్ చేస్తోంది సినిమా యూనిట్.

డ్రాగన్ సినిమా సుమారు 350 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా రుక్మిణీ వసంత్, మరో కీలక పాత్రలో అనిల్ కపూర్ నటిస్తున్నారని సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *