Jonathan Campbell: ఏ క్రికెట్ ప్లేయర్ కు అయినా తమ జాతీయ జట్టు తరఫున అరంగేట్రం చేయడం అనేది జీవితంలో పెద్ద విషయం. ఆ రోజు కోసం ఎన్నో సంవత్సరాల తరబడి కఠోర ప్రాక్టీస్ చేస్తూ కలలు కంటూ ఉంటారు. అదే తాను జాతీయ జట్టు కోసం ఆడే మొదటి అంతర్జాతీయ మ్యాచ్ లోనే అతనికి కెప్టెన్సీ చేసే అవకాశం వస్తే…? వినడానికే విడ్డూరంగా ఉంది కదూ. అసలు అరంగేట్రం చేయడం ఏమిటి? అదే మ్యాచ్ లో కెప్టెన్సీ పగ్గాలు చేతికి రావడం ఏమిటి?
జింబాబ్వే మరియు ఐర్లాండ్ మధ్య ఏకైక టెస్టు బులవాయోలోని క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్ వేదికగా గురువారం ప్రారంభమైంది. ఈ మ్యాచ్లో ప్రసిద్ధ క్రికెటర్ అలిస్టర్ క్యాంప్బెల్ కుమారుడు జోనాథన్ కాంప్బెల్ జింబాబ్వే తరఫున తన టెస్టు అరంగేట్రం చేశాడు. అతను తన మొదటి మ్యాచ్లోనే జింబాబ్వే కెప్టెన్ పదవిని స్వీకరించాడు.
ఈ మ్యాచ్ జరగడానికి కొద్ది గంటల ముందు, రెగ్యూలర్ కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్ కుటుంబ సమస్యల వల్ల జట్టు నుండి తప్పుకున్నాడు. దీని ఫలితంగా, 27 సంవత్సరాల జోనాథన్ కు జట్టు నాయకత్వ బాధ్యతలు అప్పగించబడ్డాయి. దీనితో జోనాథన్ ఓ అరుదైన రికార్డును స్వంతం చేసుకున్నాడు.
ఇది కూడా చదవండి: Janasena: జనసేన పార్టీకి మరో గుడ్‌న్యూస్
Jonathan Campbell: అరంగేట్రంలోనే జింబాబ్వే టెస్టు కెప్టెన్ గా వ్యవహరించిన రెండో వ్యక్తిగా కాంప్బెల్ నిలిచాడు. ముందుగా ఈ రికార్డు దిగ్గజ క్రికెటర్ డేవ్ హౌటన్ పేరిట ఉంది. హౌటన్ 1992లో హరారేలో భారత్ తో జరిగిన తొలి టెస్టులో జింబాబ్వే కెప్టెన్ గా వ్యవహరించాడు.
మొత్తం మీద, 21వ శతాబ్దంలో తన అరంగేట్రంలోనే టెస్టు కెప్టెన్ బాధ్యతలు స్వీకరించిన ఐదో వ్యక్తిగా జోనాథన్ కాంప్బెల్ రికార్డులకు స్థానం దక్కించుకున్నాడు. అతను ముందు న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ లీ జెర్మెన్ 1995లో భారత్ తో జరిగిన టెస్టులో మొదటి మ్యాచ్లోనే కెప్టెన్ గా ఆడాడు.
ఆ తర్వాత 2000లో బంగ్లాదేశ్ తరుపున నైమూర్ రెహమాన్, విలియం 2018లో ఐర్లాండ్ తరుపున పోర్టరీఫీల్డ్, 2018లో ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు అస్గర్ ఆఫ్ఘన్ కూడా అరంగేట్రంలోనే తమ దేశాల టెస్టు కెప్టెన్లుగా వ్యవహరించారు. జోనాథన్ కాంప్బెల్ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో చక్కటి ప్రదర్శన కనబరిచాడు, 34 మ్యాచ్లలో నాలుగు సెంచరీలతో 1,913 పరుగులు సాధించాడు. బౌలింగ్లో 42 వికెట్లు పడగొట్టాడు, ఇప్పుడేమో ఏకంగా జింబాబ్వే జాతీయ జట్టు కెప్టెన్ గా మారాడు.

