Jeevan reddy: కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.కాంగ్రెస్ పార్టీని పవర్‌లోకి తీసుకురావడానికి కష్టపడితే నేడు నోటికాడ పళ్లెం లాక్కున్నట్లు అయింది మా పరిస్థితి అన్నారు.ఎన్నో ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా కూడా.. అవమానాలు ఎదుర్కొంటునే ఉన్నామన్నారు.పది సంవత్సరాలు సర్వశక్తులు ఒడ్డిన కార్యకర్తలకు పార్టీ అండగా ఉన్నామని తెలిపారు.కాంగ్రెస్ పార్టీలో చేరే ఎమ్మెల్యేల కోసం పాత వారిని పక్కన పెట్టకండని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ ఫిరాయింపులపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు ఆయన లేఖ రాసిన విషయం తెలిసిందే. లేఖలో..’నాడు పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకంగా దేశంలో ఒకే వ్యక్తి దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ పోరాటం చేశారు.తె లివిగా అభివృద్ధి నెపంతో కొందరు పార్టీలు మారడం పరిపాటిగా మారింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సుస్థిరంగా ఉన్నా.. పార్టీ ఫిరాయింపుల వల్ల క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ కార్యకర్తలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే విషయాన్ని నేను లేఖ ద్వారా కాంగ్రెస్ అగ్రనేతలు ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు తెలిపారు. రాష్ట్ర కాంగ్రెస్‌లోని పరిణామాలను జీర్ణించుకోలేకపోతున్నా. తీవ్ర మానసిక వేదనతో హైకమాండ్‌కు లేఖ రాస్తున్నా. కానీ ఇలా చేయాల్సి వస్తున్నందుకు విచారిస్తున్నా అని తెలిపారు.