Jeedimetla Murder: జీడిమెట్లలో జరిగిన మహిళ హత్య కేసు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనలో ఊహించని విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.
హత్యకు గురైన మహిళ అంజలిని ఆమె స్వంత కూతురే ప్రియుడితో కలిసి నిఖార్సైన ప్లాన్ ప్రకారం హత్య చేసింది. ఈ కేసులో తాజాగా బాధితురాలి చిన్న కుమార్తె తేజశ్రీ చేసిన వాంగ్మూలం కేసును మరింత దారుణంగా మార్చింది.
అక్క మాటలు నమ్మిన చెల్లి కథనం ఇలా ఉంది:
నన్ను మా అక్క రోడ్డు దగ్గర ఆపింది. అమ్మ ఒక ఆంటీని తీసుకుని రమ్మంది, పదా వెళ్దాం అని చెప్పింది. 20 నిమిషాల తర్వాత తిరిగి ఇంటికి వచ్చాం. ఇంట్లోకి వచ్చేసరికి అమ్మ కిచెన్‌లో స్పృహ లేకుండా పడిపోయి ఉంది. లేపే ప్రయత్నం చేస్తే అక్కే అడ్డుకుంది.
నువ్వు బయటకు వెళ్లి ఎవరు రాకుండా చూడు, ఎవరికి చెప్పొద్దు అని చెప్పింది. కానీ తాను మాత్రం అమ్మ దగ్గరికి కూడా రాలేదు. ‘చెత్తలాగా పడి ఉంది, లేచే అవకాశం లేదు’ అని చెప్పింది.
తేజశ్రీ ఇంకా చెప్పిన వివరాలు హృదయాన్ని కలచివేస్తున్నాయి:
అమ్మ ఇంకా చనిపోలేదని తెలిసిన అక్క, మళ్లీ శివను ఫోన్ చేసి పిలిచింది. అప్పటికి అతను, అతని తమ్ముడు యశ్వంత్ వచ్చి మా అమ్మ తలపై సుత్తితో కొట్టారు. చున్నీతో మెడ బిగించి చివరికి అమ్మను చంపేశారు.
ప్రేమ పేరుతో పరువు పోగొట్టిన హత్య
తేజశ్రీ అనే పదో తరగతి విద్యార్థిని, ఇన్‌స్టాగ్రామ్‌లో డీజేగా పని చేసే శివ అనే యువకుడితో పరిచయం పెంచుకుంది. ఈ పరిచయం ప్రేమగా మారింది. దీంతో ఇంట్లో తల్లి అంజలి ఈ సంబంధాన్ని వ్యతిరేకించడంతో, ఆమెను హతమార్చాలని కుట్ర పన్నింది.
ఇది కూడా చదవండి: Hyderabad: హైదరాబాద్‌లో దారుణం: ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిన 10వ తరగతి కూతురు!
తల్లి అంజలి పూజలో ఉండగా, శివ వెనుక నుంచి బెడ్షీట్‌తో ఆమె ముఖాన్ని కప్పాడు. ఆ తరువాత తేజశ్రీ తల్లిపై సుత్తితో దాడి చేసింది. చివరకు శివ తమ్ముడు యశ్వంత్ కూడా కత్తితో గొంతు కోశాడు.
కుటుంబంలోనే కుట్ర… చెల్లి కన్నీటి వాఖ్యాలు
చెల్లిగా నమ్మిన అక్క అతి ఘోరంగా నడుచుకుందనే బాధ చెల్లెలు మాటల్లో వ్యక్తమవుతోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన ఆధారాలపై దర్యాప్తు కొనసాగుతోంది.