Jc prabhakar: నేను చంద్రబాబు అంత మంచోడిని కాదు..

JC prabhakar: రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు .. కోపం, తాపం, రోషం ఉన్నా.. పక్కన పెట్టారని జేసీ అన్నారు. తాను చంద్రబాబు అంత మంచివాడిని కాదని, కోపం, తాపం, రోషం ఉంది. అలాగే కొట్టడం కూడా తెలుసు అంటూ హెచ్చరించారు. గత వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ కార్యకర్తలను దారుణంగా వేధించారని జేసీ మండిపడ్డారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను విమర్శిస్తే ఇంటికొచ్చి చెప్పుతో కొడతానంటూ జేసీ హెచ్చరించారు.

మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి ఇంటి పక్కన ఉన్న ఐటీఐ కళాశాల భూమిని కబ్జా చేసి గేటు పెట్టాడని ఆరోపించారు. ప్రస్తుతం టీడీపీ కార్యకర్తలు నిరుత్సాహంగా ఉన్నారని, ఎమ్మెల్యేలు, నాయకులు బయటకు రావాలని జేసీ పిలుపునిచ్చారు. డిసెంబర్ 4, 5 తేదీల్లో ఆ ఇంటికి వెళ్లి గేట్లు పగలగొడతామని జేసీ హెచ్చరించారు.

కాగా, బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, టీడీపీ నేత జేసీ ప్రభాకరరెడ్డి మధ్య ఆర్టీపీపీ ఫ్లైయాష్ వివాదం నడుస్తున్న నేపథ్యంలో వైసీపీ నేత, అనంతపురం మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి కూటమి నేతలను, కూటమి ప్రభుత్వాన్ని ఉద్దేశించి విమర్శలు చేశారు. వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యలపై జేసీ ప్రభాకరరెడ్డి ఘాటుగా స్పందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *