Janasena: పిఠాపురం జనసేన సభ ప్రారంభం కాబోతోంది. ఎటు చూసినా జన సముద్రమే కనిపిస్తోంది . పిఠాపురం ఎరుపెక్కింది. వందశాతం స్ట్రైక్ రేట్ సాధించిన జనసేన విజయోత్సవాలు ఘనంగా నిరవహించనున్నారు. ఈ ఆవిర్భావ సభకు జయకేతనంగా పేరు పెట్టి జనసేనాని పవన్ కళ్యాణ్ కు తిరుగులేని మెజారిటీ ఇచ్చిన పిఠాపురం ప్రజలకు కానుకగా జనసేన ఆవిర్భావ సభను అక్కడే నిర్వహిస్తున్నారు . పదేళ్ల క్రితం హైటెక్ సిటీలో జనసేన ఆవిర్భావం జరిగింది . 2014లో బిజెపి-టిడిపి కూటమికి జనసేన మద్ధతు-కూటమి విజయం సాధించింది .
Janasena: 2019లో తొలిసారి ఎన్నికల్లో పోటీచేసిన జనసేన. 2024లో కూటమి ఏర్పాటులో జనసేనే కీలకంగా వ్యవహరించింది . పవన్ కళ్యాణ్ కూటమి ఏర్పడడం దగ్గర నుంచి దానిని విజయతీరాలకు చేర్చేవరకు అవిశ్రాంతంగా పోరాటం చేశారు. 100 శాతం సక్సెస్ రేటుతో తానూ పోటీచేసిన అన్ని స్థానాలు గెలుచుకోవడమే కాకుండా . . కూటమికి తిరుగులేని విజానాన్ని సాధించి పెట్టింది జనసేన. వైసీపీని 11 స్థానాలకు పరిమితం చేయడం ద్వారా పవన్ కళ్యాణ్ తాను అనుకున్నది చేసి చూపించారు .
2019 నుంచి 24 వరకు వైసీపీ సర్కారుపై అవిశ్రాంత పోరాటం చేసిన జనసేనాని పవన్ కళ్యాణ్ . . జగన్ ను ఛాలెంజ్ చేసి మరీ కూటమిని విజయపథంలో నిలబెట్టారు .
Janasena: పిఠాపురం జనసేన ఆవిర్భావ సభ జయకేతనం గురించిన మరిన్ని విశేషాలను . . మహావంశీ విశ్లేషణను ఈ వీడియోలో చూడొచ్చు .