Nagababu Mega Record

Nagababu Mega Record: జనసేన నేత నాగబాబు ఎమ్మెల్సీగా ఎన్నిక – మంత్రివర్గంలో చోటు దక్కనున్నదా?

Nagababu Mega Record: ప్రస్తుతం జనసేన నేత, మెగా బ్రదర్‌ నాగబాబుకు రాజయోగం నడుస్తున్నట్లుంది. ఆయన ఓ ట్వీట్‌ చేసినా, ప్రత్యర్థులకు కౌంటర్‌ ఇచ్చినా క్షణాల్లో సంచలనంగా మారుతూ ఉంటుంది. నిన్నటి జనసేన ఆవిర్భావ సభలో ఆయన ప్రసంగం కూడా అదే కోవలోకి వస్తుంది. అలా జనసేనలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు నాగబాబు. ఇక తాజాగా ఎమ్మెల్సీగా ఎన్నికైన నాగబాబు.. త్వరలో ఓ అరుదైన ఫీట్‌ సాధించబోతున్నారు.

జనసేన ఆవిర్భావ సభ అనగానే ఆ పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ స్పీచ్‌ ఎలాగో హైలెట్‌గా నిలుస్తుంది. కానీ నిన్న జరిగిన జనసేన ఆవిర్భావ సభలో అధినాయకుడు పవన్‌ కళ్యాణ్‌ స్పీచ్‌ తర్వాత బాగా పేలిన స్పీచ్‌ నాగబాబుదే. పిఠాపురం టీడీపీ నేత వర్మ టార్గెట్‌గానే నాగబాబు ఆ వ్యాఖ్యలు చేశారని ప్రచారం జరుగుతోంది. కూటమిలో, ప్రభుత్వంలో భాగస్వామ్య పార్టీగా ఉన్నప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు అవసరమా? అని నాగబాబును పలువురు తప్పు పడుతున్నారు కానీ.. అన్ని లెక్కలు వేసుకుని, అన్నీ ఆలోచించుకున్నాకే నాగబాబు ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారన్నది వాస్తవం. కొద్దిరోజుల కిందట పిఠాపురం వర్మ పోస్ట్‌ చేసి, డిలీట్‌ చేసిన ట్వీట్‌ గుర్తుందా? ఎన్నికల్లో పవన్‌ కళ్యాణ్‌ కోసం ప్రచారం చేస్తున్న వీడియోలను తన ట్వీట్‌కు జత చేసి.. కష్టపడి సాధించిన విజయానికే గౌరవం అంటూ ఓ కొటేషన్‌ కూడా తగిలించారు.

జనసేన నేత నాగబాబు ఎమ్మెల్సీ అయ్యారు. ఆయన అధికారికంగా ఎమ్మెల్సీ అయినట్లు ఎన్నికల అధికారులు ధ్రువీకరించారు. ఆయనతోపాటు టిడిపి నుంచి బీద రవిచంద్ర, బీటీ నాయుడు, కావలి గ్రీష్మ, బిజెపి నుంచి సోము వీర్రాజు ఎమ్మెల్సీలుగా ఎన్నికైనట్లు ప్రకటించారు. అయితే నాగబాబు మరో రికార్డుకు చేరువయ్యారు. ఆయనను క్యాబినెట్ లోకి తీసుకుంటే.. శాసనమండలి నుంచి మంత్రిగా ఎన్నికైన తొలి నేతగా ఆయన గుర్తింపు పొందుతారు. ఇప్పటివరకు శాసనమండలి నుంచి ఎవరిని మంత్రివర్గంలోకి తీసుకోలేదు చంద్రబాబు. యనమల రామకృష్ణుడు ఎమ్మెల్సీగా ఉన్న ఆ అవకాశం ఇవ్వలేదు. తొలిసారిగా జనసేనకు ఈ అరుదైన అవకాశం దక్కనుంది.

2014లో టిడిపి అధికారంలోకి వచ్చింది. అప్పట్లో శాసనమండలి సభ్యులుగా ఉన్న యనమల రామకృష్ణుడు, నారాయణ లను మంత్రివర్గంలోకి తీసుకున్నారు చంద్రబాబు. అప్పట్లో వారిద్దరు ఎమ్మెల్యేలుగా ఎన్నిక కాలేదు. దీంతో క్యాబినెట్లో కూర్పులో భాగంగా వారిద్దరికీ అవకాశం ఇచ్చారు. మరోవైపు మంత్రిగా నారా లోకేష్ కు తొలి అవకాశం ఇచ్చారు. అనంతరం ఆయనను ఎమ్మెల్సీ చేశారు. కానీ ఈసారి ఆ అవకాశం లేదు. లోకేష్ మంగళగిరి నుంచి గెలిచారు.

Also Read: Warangal: వరంగల్‌లో ఓ కిలాడీ లేడీ అరాచకాలు..

Nagababu Mega Record: నారాయణ నెల్లూరు నుంచి విజయం సాధించారు. యనమల రామకృష్ణుడు బదులు ఆయన కుమార్తె దివ్య తుని నుంచి గెలిచారు. శాసనమండలి నుంచి ఎవ్వర్నీ మంత్రివర్గంలోకి తీసుకోలేదు. వాస్తవానికి ఈ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి పార్లమెంటులో అడుగు పెట్టాలన్నది నాగబాబు ఆలోచన. అందుకు తగ్గట్టుగానే అనకాపల్లి పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయాలని అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ చివరి నిమిషంలో కుదరలేదు. నాగబాబు వెనక్కి తగ్గాల్సి వచ్చింది.

ఎన్నికల్లో కూటమి సమన్వయ బాధ్యతలు తీసుకున్నారు. కూటమి గెలుపునకు కృషి చేశారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యసభకు ఎంపికై పార్లమెంట్లో అడుగు పెట్టాలని భావించారు. రాజ్యసభ పదవి దక్కక పోయేసరికి నాగబాబును రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకుంటామని చంద్రబాబు ప్రకటించారు. ఇప్పుడు ఎమ్మెల్సీగా ఎన్నిక కావడంతో త్వరలో నాగబాబును మంత్రిగా తీసుకోవడం ఖాయమని తేలుతోంది.

నాగబాబు మంత్రి అయితే మెగా కుటుంబం సరికొత్త రికార్డు సృష్టించినట్టే. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి కేంద్ర మంత్రిగా వ్యవహరించారు. ప్రజారాజ్యం పార్టీని స్థాపించి అనుకున్నది సాధించలేకపోయారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి కేంద్రమంత్రి పదవి పొందారు. జనసేన ను ఏర్పాటు చేసిన పవన్ కళ్యాణ్ సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఈ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అయ్యారు. ఇప్పుడు నాగబాబు ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. త్వరలో మంత్రి పదవి చేపట్టనున్నారు. సినీ రంగం నుంచి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు పదవులు అందుకోవడం ఇదే తొలిసారి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *