AICC చీఫ్ మల్లికార్జున ఖర్గే అస్వస్థతకు గురయ్యారు జమ్మూ కాశ్మీర్ లోని కథువాలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ ఉన్నట్టుండి అదుపు తప్పి కింద పడబోయారు. పక్కనే ఉన్న నేతలు ఖర్గేను కిందపడకుండా పట్టుకున్నారు. ఖర్గే సహచరులు ఆయన్ని పట్టుకొని కుర్చీలో కూర్చోబెట్టారు.
కాంగ్రెస్ చీఫ్ ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారని, వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారని పార్టీ నేతలు తెలిపారు ఆయన అస్వస్థతకు గురికాక ముందే తనకు ఎనబై మూడేళ్లు అయినప్పటికీ.. ఫిట్ గా ఉన్నాని అన్నారు. మోదీ సర్కార్ ను గద్దె దించే వరకు బతికే ఉంటానన్నారు ఖర్గే. జమ్ము కాశ్మీర్ కు మళ్లీ రాష్ట్ర హోదా వచ్చే వరకు కాంగ్రెస్ పోరాడుతుందని తెలిపారు.