Jagital: అవునండీ.. మీరు విన్నది నిజమే.. బిడ్డ పిల్లలకు, కొడుకు పిల్లలకు బారసాల చేయడం మనం విన్నాం. కానీ పెంపుడు కుక్కకు కలిగిన నాలుగు పిల్లలకు బారసాల చేసి పండుగు చేసుకున్నారు ఈ దంపతులు. బంధుమిత్రులను, ముత్తైదువలను పిలుచుకొని, పసుపు, కుంకుమలు పెట్టి గౌరవించారు. కుక్కను, దాని పిల్లలకు పసుపు, కుంకుమ పెట్టి ఒక్కోదానికి ఒక్కో పేరుతో పిలిచి సంబురం చేసుకున్నారు.
Jagital: జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణంలోని సుభాష్‌నగర్‌కు చెందిన రాపెల్లి వినోద, లావణ్య దంపతులు ఏడాది క్రితం షీడ్డూ జాతికి చెందిన కుక్కను తెచ్చుకొని పెంచుకుంటున్నారు. ఆ కుక్క ఇటీవలే నాలుగు పిల్లలు జన్మనిచ్చింది. ఆ పిల్లలకు ఆ దంపతులు వేడుక జరిపి బారసాల చేశారు. ఈ వేడుకను ఆసాంతం వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు కూడా చేశారు. ఒక వేడుకలా జరుపుకోవడంపై ఊరు ఊరంతా చర్చించుకుంటున్నది. పెంపుడు కుక్కపై తమకున్న ముద్దు ముచ్చటను ఇలా తీర్చుకున్నారంటూ పలువురు చెప్పుకుంటున్నారు.