Jagadeesh Reddy: రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్‌పై, సీఎం రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ పాలనా తీరు, కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు, సిరిసిల్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ దాడి విషయాలపై ఆయన తీవ్రంగా స్పందించారు. సిరిసిల్ల ఘటనను జగదీశ్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్నిరంగాల్లో విఫలమైందని విమర్శించారు.
Jagadeesh Reddy: అవినీతి విషయంలోనే కాంగ్రెస్ సర్కార్ అద్భుత ప్రగతిని సాధించిందని జగదీశ్‌రెడ్డి ఎద్దేవా చేశారు. అన్ని ప్రభుత్వ శాఖల్లో అవినీతి రాజ్యమేలుతుందని ధ్వజమెత్తారు. ఏ మంత్రి ఎంత సంపాధించాలె.. సీఎం సీటు కోసం ఎలా పోటీ పడాలె.. అన్న సోయి తప్ప మరో మంచి పనిచేయాలన్న తపన వారికి లేదని మండిపడ్డారు. అభివృద్ధిని పక్కన పెట్టి దోచుకునే విషయంలో పోటీ పడుతున్నారని విమర్శించారు.
Jagadeesh Reddy: రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిని ప్రశ్నిస్తున్న వారికి నోటీసులు ఇప్పించి ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని జగదీశ్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఈడీ కేసులో రేవంత్‌రెడ్డి పేరున్నప్పటికీ మోదీని కలవడానికి వెళ్లాడంటేనే అర్థమవుతుందని, రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ దోసీ ఎట్లుందో ఇట్టే అర్థమవుతుందని ఆరోపించారు.
Jagadeesh Reddy: సీఎం రేవంత్‌రెడ్డి తన చిల్లర చేష్టలతో రాష్ట్ర ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నారని జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. అందాల పోటీలతో ప్రపంచం ముందు తెలంగాణ పరువు తీసిండని మండిపడ్డారు. కేటీఆర్‌కు నోటీసులు ఇస్తే బయటపడతామని అనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. ఆనాడు ఏసీబీ కార్యాలయంలో 8 గంటలపాటు కేటీఆర్ కూర్చొని స్వయంగా చెప్పిన విషయం మీకు గుర్తుకులేదా? అని నిలదీశారు. ప్రపంచ వ్యాప్తంగా కేటీఆర్ క్రేజీ పెరుగుతందనే రేవంత్ ఈర్ఝ పెట్టుకున్నారని ఆరోపించారు.
Jagadeesh Reddy: తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు ఇతర దేశాల ఆహ్వానం మేరకు వెళ్తున్నాడని సీఎం రేవంత్ తట్టుకోలేక పోతున్నారని జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. ఆ సభకు హాజరుకాకుండా ఆపాలనే అక్కసుతోనే ఇప్పుడు నోటీసులు ఇచ్చారని తెలిపారు. నోటీసులతో చిల్లర డ్రామాలు చేస్తూ మరింత నవ్వుల పాలవుతున్నారని పేర్కొన్నారు.
Jagadeesh Reddy: అసలు కాళేశ్వరం ఎందుకు కేసీఆర్ కట్టిండో అనే విషయంపై కాంగ్రెస్ పార్టీకి అవగాహనే లేదని, మన నీళ్లను చంద్రబాబు తీసుకెళ్తుంటే సర్కార్‌కు సోయి లేదని జగదీశ్‌రెడ్డి ధ్వజమెత్తారు. కేటీఆర్ క్యాంపు కార్యాలయంపై చిల్లర మూకలకు ఏంపని అని ప్రశ్నించారు. ప్రొటోకాల్ విధానాన్ని చూడాల్సింది అధికారులేనని గుర్తుచేశారు. రేవంత్‌రెడ్డి బాస్‌లనే ఈ ప్రాంతం నుంచి తరిమికొట్టామని, వీరొక లెఖ్క కాదని, ఇప్పటికైనా ఒళ్లు దగ్గర పెట్టుకొని పనిచేయాలని, అభివృద్ధి, సంక్షేమంపై దృష్టి పెట్టాలని జగదీశ్‌రెడ్డి హితవు పలికారు.