Jaat Movie

Jaat Movie: ‘జాట్’ సెన్సార్ కంప్లీట్!

Jaat Movie: బాలీవుడ్ యాక్షన్ సూపర్‌స్టార్ సన్నీ డియోల్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ ‘జాట్’ సినీ ప్రియుల్లో భారీ హైప్ క్రియేట్ చేస్తోంది. సౌత్ స్టార్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఈ చిత్రాన్ని రూపొందిస్తుండటంతో ఉత్తరాది, దక్షిణాది ప్రేక్షకుల్లోనూ అంచనాలు పీక్స్‌కి చేరాయి.

ఇప్పటివరకు విడుదలైన టీజర్లు, పోస్టర్లు ఈ మూవీపై ఉత్కంఠను రెట్టింపు చేశాయి. పూర్తి యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమా.. మాస్ ఆడియన్స్‌కి కనువిందు చేయనుందని టాక్. తాజాగా సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ‘యూ/ఏ’ సర్టిఫికెట్ జారీ చేసిన సెన్సార్ అధికారులు.. కంటెంట్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చెప్పారు.

Also Read: Lenin: లెనిన్‌తో అఖిల్ హిట్ కొట్టేనా? డీగ్లామ్ ఫార్ములా వర్కౌట్ అవుతుందా?

Jaat Movie: రణ్‌దీప్ హుడా, రెజీనా కాసాండ్రా, వినీత్ కుమార్ సింగ్, సయ్యామీ ఖేర్ లాంటి స్టార్ కాస్ట్‌తో ఈ సినిమా హై వోల్టేజ్ డ్రామాను అందించనుంది. మ్యూజిక్ మాస్ట్రో థమన్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తుండగా.. మైత్రి మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. యాక్షన్, ఎమోషన్, ఎంటర్‌టైన్‌మెంట్‌తో ‘జాట్’ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఈ సినిమా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి!

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *