ISKCON

ISKCON: బంగ్లాదేశ్ లో ఇస్కాన్ మత గురువు చిన్మోయ్ కృష్ణన్ దాస్ ప్రభు అరెస్టు

ISKCON: బంగ్లాదేశ్ ఇస్కాన్‌తో సంబంధం ఉన్న మత గురువు చిన్మోయ్ కృష్ణ దాస్ ప్రభును అరెస్టు చేశారు. అక్కడి మీడియా కథనాల ప్రకారం, అతనిపై దేశద్రోహం,  మత సామరస్యానికి భంగం కలిగించినందుకు కేసు ఉంది. ఆయనను ఢాకాలోని మింటు రోడ్డులోని డీబీ కార్యాలయానికి తీసుకెళ్లినట్లు చిన్మయ్ ప్రభు సహాయకుడు ఏడీ ప్రభు తెలిపారు. చిన్మయ్ ప్రభు విడుదల కోసం ఢాకాలో నిరసనలు మొదలయ్యాయి. ఢాకాలోని సెహాబాగ్‌లో ఆందోళనకారులు ప్రధాన రహదారిని దిగ్బంధించారు. ‘న్యాయం కోసం చస్తాం, పోరాడతాం’ అంటూ నినాదాలు చేస్తున్నారు. దీంతో పాటు దినాజ్‌పూర్, చిట్టగాంగ్‌లో కూడా రోడ్లను దిగ్బంధించి నినాదాలు చేస్తున్నారు.

బంగ్లాదేశ్ మీడియా వివరాల ప్రకారం, చిన్మయ్ ప్రభు ఢాకా నుండి చిట్టగాంగ్‌కు వెళ్ళడానికి హజ్రత్ షాజలాల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు.  ఇక్కడ నుండి డిటెక్టివ్ పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. డిబి పోలీసులు ఎలాంటి అరెస్ట్ వారెంట్‌ను చూపలేదని సంఘటనా స్థలంలో ఉన్న ఇస్కాన్ సభ్యులు చెబుతున్నారు. వారు మాట్లాడాలని మాత్రమే చెప్పారు. ఆ తర్వాత మైక్రోబస్‌లో తీసుకెళ్లారు.

ISKCON: చిన్మోయ్ ప్రభుని చిన్మోయ్ కృష్ణ దాస్ బ్రహ్మచారి అని కూడా పిలుస్తారు. బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్‌లో నిరసనలకు ఆయన నాయకత్వం వహించారు. పోలీసుల అభ్యర్థన మేరకు చిన్మోయ్ కృష్ణ దాస్‌ను అరెస్టు చేసినట్లు ఢాకా మెట్రోపాలిటన్ పోలీస్ డిటెక్టివ్ బ్రాంచ్ అదనపు పోలీసు కమిషనర్ రెజాల్ కరీమ్ మల్లిక్ తెలిపారు. బంగ్లాదేశ్ సనాతన్ జాగరణ్ మంచ్ అక్టోబర్ 25న చిట్టగాంగ్‌లో ర్యాలీ నిర్వహించింది. దీనిలో  చిన్మోయ్ కృష్ణ దాస్ ప్రసంగించారు. ర్యాలీ ముగిసిన వెంటనే, BNP నాయకుడు ఫిరోజ్ ఖాన్ చిన్మోయ్ కృష్ణ దాస్‌పై చిట్టగాంగ్‌లో దేశద్రోహం కేసు పెట్టారు. ఆయన జాతీయ జెండాను అవమానించారని ఆరోపించారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *