JAAT

Jaat: సన్నీ డియోల్ ‘జాట్’ రవితేజ కథేనా!

Jaat: యాక్షన్ స్టార్ సన్నీ డియోల్ బర్త్ డే సందర్భంగా ఇటీవల ఆయన నటిస్తున్న తాజా చిత్రం టైటిల్ ప్రకటన వెలువడింది. మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్స్ మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు ‘జాట్’ అనే పేరు పెట్టారు. ‘క్రాక్’ తర్వాత మరోసారి రవితేజతో దర్శకుడు మలినేని గోపీచంద్ ఓ సినిమా తీయాల్సి ఉంది. అయితే బడ్జెట్ విషయంలో భయపడి మైత్రీ మూవీమేకర్స్ సంస్థ వెనకడుగు వేసింది. అదే కథతో ‘జాట్’ తెరకెక్కుతోందని వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పటికే ‘జాట్’ రీమేక్ కాదని మలినేని గోపీచంద్ స్పష్టం చేయడంతో ఈ వార్తలకు బలం చేకూరింది. కారంచేడు దుర్ఘటనను బేస్ చేసుకుని మలినేని గోపీచంద్… రవితేజ మూవీకి కథను రాశారని, కానీ సెట్స్ మీదకు వెళ్ళకపోవడంతో ఆ కాస్ట్ ఇష్యూని పంజాబ్ నేపథ్యానికి మార్చి ఇప్పుడు సన్నీ డియోల్ తో ‘జాట్’ తీస్తున్నాడని అంటున్నారు. మరి ‘గదర్ -2’ మరోసారి గ్రాండ్ సక్సెస్ అందుకున్న సన్నీ డియోల్ కు ‘జాట్’ ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Pan Card: పాన్ కార్డు మారుతోంది.. క్యూఆర్ కోడ్ తో వస్తుంది..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *