Sankaranarayana: దేశంలోని కొందరు రాజకీయ నాయకులకు అదృష్టం కలిసి వస్తుంది. మరికొందరికి దురదృష్టం వెంటాడుతూనే ఉంటుంది ఫస్ట్ టైం ప్రత్యక్ష ఎన్నికల్లో బరిలో నిలిచి భారీ మెజారిటీతో గెలిచి ఎవరు ఊహించని విధంగా క్యాబినెట్‌లో మంత్రి పదవులు దక్కించుకుంటారు. తెలుగు రాష్ట్రాల్లో ఇలా చాలామంది రాజకీయ నాయకులు ఈ కోవకు చెందిన వారే ఉన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ బీఫామ్ తీసుకున్న వారందరూ ఎమ్మెల్యేలుగా గెలిచిన చాలామంది కొత్తవారికి మంత్రులుగా అవకాశం దొరికింది. ఆంధ్రప్రదేశ్‌లో 2019,2024 ఎన్నికల్లో కొందరు ప్రజాప్రతినిధుల గెలుపు మాత్రం వేవ్ గాలి వీచడంతోనే ఎమ్మెల్యేలు, ఎంపీలుగా గెలిచారనేది ప్రజల్లో చర్చ నడిచింది.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో వైసీపీ ప్రజా ప్రతినిధులు ఇందుకు ఉదాహరణ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు…2019 సార్వత్రిక ఎన్నికల్లో కొందరు ప్రజాప్రతినిధులుగా గెలిచారు వెళ్లిపోయారనే విధంగా వారి రాజకీయ ప్రస్థానం కొనసాగిందంట…2024 ఎన్నికల ఓటమి అనంతరం… వారు రాజకీయాల్లోకి వచ్చారు పోయారనే విధంగా ఉంది. గత ఐదు సంవత్సరాలలో వైసీపీ నాయకులు నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయకపోవడంతోనే ప్రజలు వాళ్లును తిరస్కరించారనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది.మాజీ మంత్రి శంకర్ నారాయణ పెనుకొండ నుంచి అనంతపురం పార్లమెంట్ అభ్యర్థిగా వచ్చానా తర్వాత ఆయన రాజకీయ ప్రస్థానం ముగిసినట్లే అని రాజకీయ విశ్లేషకుల్లో టాక్ నడిచింది.
Sankaranarayana: వైసీపీ మాజీ మంత్రి శంకర్ నారాయణ రాజకీయంగా ఎంత స్పీడ్‌గా ఎదిగారో అంతే స్పీడ్‌గా డౌన్ పాలయ్యారంట. ఎందుకంటే 2014 ఎన్నికల ముందు శంకర్ నారాయణ గురించి ప్రజలకు పెద్దగా తెలియదు.ధర్మవరం పట్టణంలో ఒక వార్డుకు మాత్రమే పరిచయం ఉన్న వ్యక్తి… ఎందుకంటే ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో ఎక్కడ పోటీ చేసిన దాఖలాలు లేవు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన తర్వాత పెనుకొండ నుంచి ప్రతక్ష్య ఎన్నికల్లో పోటీ చేయడానికి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఒక అవకాశం ఇచ్చారు టీడీపీ అభ్యర్థి బి.కే పార్థసారధి చేతిలో ఓడిపోయారు.
అనంతరం శంకర్ నారాయణ అనంతపురం వైసీపీ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగడం… 2019 ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ గాలివీచడంతో పెనుగొండ నుంచి ఎమ్మెల్యేగా శంకర్ నారాయణ గెలిచారు. ఎవరు ఊహలకి అందని విధంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మొదటి కేబినెట్ విస్తరణలోనే బీసీ కోటా కింద శంకర్ నారాయణకు మంత్రి పదవి ఇచ్చారు. రెండున్నర సంవత్సరం తర్వాత శంకర్ నారాయణ మంత్రి పదవి ఊడిపోయింది. అప్పటికే సొంత నియోజకవర్గంలో మాజీ మంత్రిపైన వైసీపీ క్యాడర్ తిరుగుబాటు చేయడం, ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత మూట కట్టుకోవడంతో అధిష్టానం పెనుగొండ నుంచి తప్పించి అనంతపురం పార్లమెంటు ఎంపీ అభ్యర్థిగా ప్రమోషన్ ఇచ్చారు. ఆది మాజీ మంత్రి శంకర్ నారాయణకు రాజకీయంగా డెమోషన్ అయిందంట… అంతే అక్కడి నుంచి ఆయన రాజకీయ ప్రస్థానం డౌన్ పాల్ స్టార్ట్ అయిందంట.
Sankaranarayana: ఉమ్మడి అనంతపురం జిల్లా అంటేనే బీసీలు పదం ఎక్కువగా వినిపిస్తుంది. ప్రధాన రాజకీయ పార్టీలైన టీడీపీ, వైసీపీ బీసీ అభ్యర్థులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు అందులోనూ రాజకీయంగా ఇక్కడ ఈ రెండు కులాలకు చెందిన నాయకులు వాల్మీ, బోయ, కురుబ కులాలకు టికెట్లు ఎక్కువగా కేటాయిస్తారు. అందులో భాగంగానే బీసీ కోటాలో పెనుగొండ నుంచి శంకర్ నారాయణకు అవకాశమిచ్చారు. ఒకసారి ఓడిపోయారు మరోసారి గెలిచారు ఏకంగా మంత్రి పదవి చేపట్టారు మంత్రి పదవి వచ్చాక శంకర్ నారాయణ పెనుగొండలో అభివృద్ధి చేయడం మర్చిపోయారంటా… పెద్దలు చెప్పిన సామెత దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి అనే సామెతను శంకర్ నారాయణ పర్ఫెక్ట్ అమలు చేశారంటా… మంత్రి పదవిని అడ్డం పెట్టుకొని విచ్చలవిడిగా భూకబ్జాలు… ప్రతి పనికి కమిషన్ తీసుకొని కోట్ల రూపాయలు వెనకేసుకున్నారని అప్పటి టీడీపీ నాయకులతోపాటు సొంత పార్టీ నాయకులు పెద్ద ఎత్తన విమర్శలకు ఎక్కుపెట్టారు.
ఇప్పుడున్న ట్రెండ్ రాజకీయాలకు నాయకుడు బలం ఒక్కటే సరిపోదు అంట… ఆ నాయకుడికి ఆర్థిక బలంతో పాటు ఖర్చుపెట్టే మనస్తత్వం ఉంటేనే రాజకీయాల్లో రాణించగలరు అనేది రాజకీయ విశ్లేషకులు మాట… శంకర్ నారాయణ మాత్రం నా రూటే సపరేట్ అనేవారంటా… ఒక్క బీసీ ట్యాగ్ వేసుకొని రాజకీయం చేశారని అపవాదా ఉంది. ఇప్పుడు నడుస్తున్న రాజకీయాల్లో పార్టీ అవకాశం ఇస్తే ఆర్థిక బలం హంగుబలం రాజకీయంగా రాణించాలని కురుబ కులస్తుల్లోనే చాలామంది నాయకుల్లో పోటీ తత్వం ఉండే జనరేషన్… సో… శంకర్ నారాయణ మాత్రం ఇప్పుడు నడుస్తున్న దూకుడు రాజకీయాలను అందుకోలేకపోయారా… ఆర్థికంగా డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుందేమో అనుకున్నారో తెలియదు కానీ… బీసీ ట్యాగ్ బెడిసికొట్టడంతో పెనుకొండ టిక్కెట్ పోయింది. అనంతపురం పార్లమెంట్ అభ్యర్థిగా కూడా ఘోరంగా ఓడిపోవడంతో … మూట ముల్లు సర్దుకుని సొంత ఊరు ధర్మవరానికే పరిమితమయ్యాని కూటమి నాయకులు మాజీ మంత్రిపైన విమర్శలు చేస్తున్నారని టాక్.
Sankaranarayana: వైసీపీ మాజీ మంత్రి శంకర్ నారాయణ రాజకీయ ప్రస్థానం ముగిసినట్లేనా అంటే సమాధానం మాత్రం ప్రస్తుత పరిస్థితులు అలాగే ఉన్నాయంటా.ఎందుకంటే ఆయన అనంతపురం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిన తర్వాత రాజకీయంగా ఆ నాయకుడు కనుమరుగయ్యారంటా.ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఓడిన వారిలో ఎక్కువ మంది నియోజకవర్గ బాధ్యతలు చూస్తున్నారు సో శంకర్ నారాయణకు ఆ అవకాశం లేదు. వైసీపీ అధిష్టానం జిల్లా అధ్యక్షుడిగా మరో అవకాశం ఇస్తారని ఆశపడ్డారు. తాజా రాజకీయాలకు శంకర్ నారాయణ అవుట్ డేటెడ్ పొలిటిషన్ అనుకున్నారేమో తెలియదు కానీ వైసీపీ అధినేత జగన్ మాజీ మంత్రికి జిల్లాలో ఎక్కడ పెద్దగా ప్రయారిటీ ఇవ్వలేదు. సో శంకర్ నారాయణ రాజకీయ ప్రస్థానం ముగిసినట్లేనా..? లేదా రాజకీయ సమీకరణాలు మార్పుల్లో భాగంగా మరోసారి తెరమీదకి వస్తారా అనేది మాత్రం కాలమే సమాధానం చెప్పాలి.