Allu Arjun Arrest

Allu Arjun Arrest: అల్లు అర్జున్ కు రిమాండ్ !

సినీ హీరో అల్లు అర్జున్ కు రిమాండ్ విధించింది నాంపల్లి కోర్టు. సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాటలో మహిళ మృతి చెందిన ఘటనలో అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసిన పోలీసులు నాంపల్లి కోర్టులో ఆయనను హాజరు పరిచారు. నాంపల్లి కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జరీ చేసింది. కొద్దిసేపట్లో అల్లు అర్జున్ ను చంచల్ గూడ జైలుకు పంపించనున్నట్టు తెలుస్తోంది.

మరోవైపు అల్లు అర్జున్ తనపై పోలీసులు పెట్టిన కేసును క్వాష్ చేయాలంటూ వేసిన పిటిషన్ పై ప్రస్తుతం హైకోర్టులో విచారణ జరుగుతోంది.

హైకోర్టులో విచారణ సమయంలో గట్టి వాదోపవాదాలు జరుగుతున్నాయి. సంధ్య థియేటర్ యాజమాన్యం ముందుగానే పోలీసు పర్మిషన్ తీసుకున్నట్టు థియేటర్ తరఫు లాయర్ చెప్పారు. కానీ, పోలీసులు మాత్రం అల్లు అర్జున్ వస్తే ఇబ్బంది అని చెప్పినట్టు చెబుతున్నారు .  పైగా అల్లు అర్జున్ ర్యాలీగా వచ్చారని ,  అదే తొక్కిసలాటకు కారణమైందని కోర్టుకు తెలిపారు.

ఈ వార్త అప్డేట్ అవుతోంది .  పాఠకుల కోసం ప్రాథమిక సమాచారం అందించడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *